షాకింగ్ న్యూస్: కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

Last Updated : Nov 10, 2018, 07:25 PM IST
షాకింగ్ న్యూస్: కూలిపోయి, ముక్కలైన మరో విమానం !

ఇండోనేషియాలో లయన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయిన ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే శుక్రవారం దక్షిణ అమెరికాలో మరో విమానం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో అందరు సురక్షితంగా ప్రాణాలతో బతికిబట్టకట్టారు. ప్రమాదం జరిగిన తీరును చూసిన నిపుణులు.. విమానయానం చరిత్రలో ఇదొక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 120 మంది ప్రయాణికులు మరో 8 మంది సిబ్బంది ఉండగా అందులో కొందరికి గాయాలు అయ్యాయి. 

జమైకాకు చెందిన ఫ్లై జమాకా బోయింగ్ 757 విమానం టేకాఫ్ అయిన అనంతరం సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. దక్షిణ అమెరికాలోని గుయనా దేశంలోని జార్జ్ టౌన్ లో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే జార్జ్ టౌన్ లోని చెడ్డి జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతిని, ముక్కలుగా విరిగిపోయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన అనంతరం ప్రమాదం తీవ్రతను తగ్గించేలా పైలట్స్ వ్యవహరించిన తీరు నిజంగా అభినందనీయం. ప్రమాదం తీవ్రతను తగ్గిస్తూ విమానాన్ని ఇలా కిందకు దించిన పైలట్స్ నిజంగానే హీరోలు అని అక్కడి మీడియా ప్రశంసించింది. 

Trending News