PM Modi Andhra pradesh Schedule: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అందులో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఏపీలో ఎన్టీయే కూటమిలోని అభ్యర్ధుల విజయం కోసం ఈ నెల 7 మరియు 8 తేదిల్లో ప్రధాన మంత్రి ఏపీలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్ పాల్గొననున్నారు. రాజమహేంద్రవరం బీజేపీ అభ్యర్ధి పురంధరేశ్వరికి మద్ధతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసే సభలో మోదీ ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం 5.45 నిమిషాలకు అనకాపల్లి లోక్ సభ పరిధిలోని రాజుపాలెం సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు.
ఆ ఆర్వాత మే 8 సాయంత్రం పీలేరు సభలో ప్రధాన మోదీ సభ ఉంటుంది. రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఏపీ పర్యటనకు సంబంధించి ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ ఓలేఖ విడుదల చేసింది.
మరోవైపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో జహీరాబాద్ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మే 3న వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజున నల్గోండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభల్ ప్రధాని ప్రసంగించనున్నారు. మే 4న నారాయణ పేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది.
మే 13న జరగబోయే 96 లోక్ సభ సీట్లకు 4వ విడతలో భాగంగా ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు..ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా మే 13న 9 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శ్రీనగర్‌కు ఎన్నికలకు జరనుంది. అటు తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook