Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..

Sheikh Hasina residance: బంగ్లాదేశ్ లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీవిమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు ఏకంగా పీఎం నివాసం గణభాబన్ లోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 5, 2024, 09:46 PM IST
  • కొనసాగుతున్న బంగ్లాలో అల్లర్లు..
  • డ్యాన్సులు చేస్తున్న ఆందోళన కారులు..
Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..

Bangladesh protesters are now having lunch and thefting ganabhaban: బంగ్లాదేశ్ లో ప్రస్తుతం తీవ్ర అశాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా లక్షలాదిగా ఆందోళనకారులు ఢాకాను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనాను, ఆర్మీవెంటనే రాజీనామా చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే.. షేక్ హసీనా తనప్రధానిపదవికి రాజీనామా చేసిన ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి లండన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢాకాలో ఆందోళనకారుల విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా నివాసం  గణభాబన్ లోకి చోరబడ్డారు.

 

అంతేకాకుండా.. అక్కడ చికెన్ తింటు, అక్కడ సామాన్లను ధ్వంసం చేశారు. అందిన వస్తువులను అందిన కాడికి కొందరు దోచుకుపోతున్నారు. మరికొందరుఅక్కడ బెడ్ ల  మీద పడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.  షేక్ హసీనా దేశంను వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఆందోళనకారులు అక్కడి భవంతులు ఎక్కి డ్యాన్స్ లు చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతట అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలో అక్కడి ఆర్మీ మాత్రం పరిస్థితులు అదుపులోకి తెవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

గొడవకు కారణం ఇదే..

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అక్కడి అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా అమలులో ఉండగా.. ఈ పద్ధతిని సంస్కరించాలని అక్కడి వారు పట్టుబట్టారు. కేవలం.. ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికే అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీమాత్రం తీవ్రంగా అణిచివేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకులు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు ఏకంగా 350 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఏకంగా పీఎం హసీనా తన పదవికి రాజీనామాచేసి దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లా మాజీ పీఎం అధికారిక భవంతిలో నిరసనకారులు చేసిన హల్ చల్ కు చెందిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News