అగ్రవర్ణాల పేదల కోసం కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు కావడం లేదని బీజేపీ చీఫ్ కన్నా ఆరోపించారు. దీన్ని బట్టి అగ్రవర్ణాల పేదల సమస్యలపై వైసీపీ సర్కార్ కు ఎంత మాత్రం చిత్తశుద్ది ఉందో అర్థమౌతున్నారు. ఇదే సమయంలో జగన్ సర్కార్ హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు. ప్రజా ధనంతో కేవలం ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈబీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 4న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని కన్నా తెలిపారు. అలాగే ఇసుక కొరతపై 7న భిక్షాటన చేపడతామని... 11న పోలవరంలో పర్యటిస్తామని తెలిపారు. పరిపాలన విధానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి తేడా లేదని కన్నా విమర్శించారు. ఏపీ ప్రజల పక్షాల పోడేందుకు బీజేపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.