వరుసగా 13వ రోజు..తగ్గిన పెట్రో ధరలు

                                                        

Last Updated : Jun 11, 2018, 12:58 PM IST
వరుసగా 13వ రోజు..తగ్గిన పెట్రో ధరలు

దేశ‌వ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా 13వ రోజు పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు 20 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గించినట్లు అయిల్ కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గడంతో ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించాయి.కాగా తగ్గిన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రో ధరలు తగ్గుముఖం పట్డడం.. సామాన్యులకు స్వల్ప ఉపశమనం కలిగిస్తోంది. వివిధ నగరాల్లో పెట్రో ధలు ఇలా ఉన్నాయి..

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్  ధరలు:

ప్రదేశం లీ.పెట్రోల్ ధర లీ. డీజిల్ ధర
హైదరాబాద్  రూ. 81.12 రూ.74.22
విజయవాడ రూ. 82.37    రూ. 74.83
చెన్నై రూ.79.48 రూ. 71.73
ఢిల్లీ రూ.76.58  రూ. 67.95
ముంబై  రూ.84.41 రూ.72.35
కోల్ కతా రూ.79.25 రూ. 70.50

వివిధ రాష్ట్రాల్లో విధించే VAT టాక్స్ ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రో ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ ప్రభావంతో దేశ రాజధాని కంటే ధర రూ.5 వ్యత్యాసం కనిపిస్తోంది.

Trending News