Dil Raju about Game Changer : రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం.. రెండు సంక్రాంతి సినిమాలను కూడా నిర్మించిన.. నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న విరుదలవుతుండగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈరోజు సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
‘‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మేం అడగగానే ఈవెంట్‌కు రావడం ..ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది," అన్నారు నిర్మాత దిల్ రాజు.
“తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి పండుగను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇప్పుడు గ్లోబల్ ఆడియెన్స్ కూడా మా సినిమాలను ఆసక్తిగా చూస్తున్నారు. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పూర్తిచేయడంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. నాకెంతో ప్రత్యేకం. మూడు, నాలుగేళ్ల కృషికి ఫలితం రానుంది," అన్నారు. ‘‘గేమ్ చేంజర్‌లో రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్, ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు విజిల్స్ వేయించేలా ఉంటాయి. చిత్రంలో కేవలం కమర్షియల్ అంశాలు కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంది," అన్నారు. ఇక వీటితోపాటు సినిమా పాటలకు రూ. 75 కోట్ల ఖర్చు చేయడం, 2 గంటల 43 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేయడం వంటి అంశాలను షేర్ చేశారు.
‘‘పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. ఆయన మాదిరి అనుభవాలను ఎదుర్కొని గేమ్ చేంజర్ వంటి సినిమాను పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది,’’ అని చెప్పకువచ్చారు.. దిల్ రాజు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చిందని, సానుకూల స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి గొప్ప కథను అందించారు. F2ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసినట్టుగా ఈ సినిమాను కూడా ఆస్వాదిస్తారు," అన్నారు. ఇరువైపు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తన లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు అభిమానులను కోల్పోయాం. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో బాధను వ్యక్తం చేయడం చాలా అవసరం," అన్నారు.
‘‘తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లింది. అందుకు తగిన విధంగా బడ్జెట్, పద్ధతులు పెరిగాయి. శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాను," అని చెప్పకు వచ్చారు.
Also Read: China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..
Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్లో అపశ్రుతి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్భ్రాంతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.