పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.

Updated: Jul 12, 2018, 08:10 PM IST
పవన్ కళ్యాణ్  పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక చలనచిత్ర నటుడు, రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలో తెలియక అవగాహన రహితమైన పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయనకు ఏ విషయం పై కూడా స్పష్టమైన అవగాహన ఉన్నట్లు  కనిపించడం లేదని.. ఏ అంశంపై కూడా క్లారిటీ లేని విధంగా ఆయన మాట్లాడుతున్నారని రామ్మోహన నాయుడు తెలిపారు. బీజేపీ, వైఎస్సార్ పార్టీ, జనసేన పార్టీ.. ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం కుర్చీ నుండి దించేందుకే యత్నిస్తున్నానని.. అందుకు అనువైన విధంగానే పావులు కదుపుతున్నాయని.. ఈ విషయాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

ఇప్పటికే కర్ణాటకలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని.. జీఎస్టీ, నోట్లరద్దు లాంటి అంశాల వల్ల ప్రజలు బీజేపీ పాలన పట్ల విముఖత కనబరుస్తున్నారని.. ఏపీలో కూడా బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కింజరపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం ఇప్పటికీ ఎన్నికల మీదే ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు.