పరిపూర్ణానందకు మరో షాక్ ; మరో రెండు కమిషనరేట్లు బహిష్కరణ నిర్ణయం

                      

Updated: Jul 12, 2018, 03:27 PM IST
పరిపూర్ణానందకు మరో షాక్ ; మరో రెండు కమిషనరేట్లు బహిష్కరణ నిర్ణయం

జనాలను రెచ్చొగొట్టి మతకల్లోహాలు  సృష్టించేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం పరిపూర్ణానందస్వామిని ఆరు నెలలపాటు హైదరాబాద్ పోలీసులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్లు కూడా పరిపూర్ణానందను బహిష్కరించాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులో పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన స్వస్థలం కాకినాడకు వెళ్లినట్లు సమాచారం.

హైదరాబాద్ నగర బహిష్కరణ చేయడంతో స్వామి పరిపూర్ణానంద  సైబరాబాద్ కమిషనేరేట్ పరిధిలో నివాసముండేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. స్వామీ సైబరాబాద్, రాచకొండ పరిధిలోరాకుండా ఈ మేరకు బహిష్కరణ చేశారు.
 
పరిపూర్ణానంద బహిష్కరణ వేటును ఖండిస్తూ ఆయన మద్దతు దారులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కాగా తాజా పరిణమాంతో పరిస్థితి మరింత వేడేక్కే అవకాశముంది. ఇదిలా ఉండగా బీజేపీ నేతలు కూడా స్వామి పరిపూర్ణానందస్వామి బహిష్కరణ వేటు నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదే అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో మరో రెండు కమిషనరేట్లు పరిపూర్ణానందపై బహిష్కరణ వేటు వేయడం గమనార్హం..