TS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో సెక్షన్ 144 విధించారు. పోలింగ్ సందర్భంగా విధి విధానాలు అటు మీడియాకు, ఇటు రాజకీయ పార్టీలకు జారీ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ , ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు 525 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. వీరిలో 475 మంది పురుషులు కాగా 50 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 32 వేలమంది ఓటర్లున్నారు. వీరిలో 1 కోటి 65 లక్షల 28 వేలు పురుషులు కాగా, 1 కోటి 67 లక్షల మహిళలున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 2 లక్షల 80 వేల మంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధికంగా 3226 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం 1 లక్షా 9 వేల ఈవీఎంలు సిద్ధం చేశారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
ఇక మీడియాకు, రాజకీయ పార్టీలకు దిశా నిర్దేశం జారీ అయింది. మే 12, 13 తేదీల్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్సైట్లలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అదే సమయంలో జూన్ 1 సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంది. తెలంగాణలో 1.88 లక్షలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇక 21, 690 మంది హోమ్ ఓటింగ్ వేశారు. పోలింగ్ ముగిసేవరకూ కట్టుదిట్టమైన నిఘా ఉండాలని ఎన్నికల సంఘం అదికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ, రవాణాను నియంత్రించాలని కోరారు.
Also read: AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook