Top Selling Cars: మారుతి సుజుకి కారు మోడల్ ఏదైనా సరే దేశ ప్రజల్ని చాలా ఆకట్టుకుంటుంది. అత్యధిక విక్రయాలు నమోదు చేస్తుంటుంది. ఇతర కంపెనీ కార్ల కంటే తన కంపెనీ కార్లతోనే ఎక్కువగా పోటీ పడుతుంటుంది. ఇప్పుడు మరోసారి వేగన్‌ఆర్‌ను కాదని మారుతి కంపెనీకు చెందిన మరో కారు అత్యధిక విక్రయాలు జరిపింది.
మారుతి సుజుకి కంపెనీ కార్లంటే దేశంలో అందరికీ క్రేజ్ ఎక్కువ. తక్కువ ధర, అత్యధిక ఫీచర్లు, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్, ఎక్కువ రీసేల్ విలువ ఇవన్నీ మారుతి సుజుకి కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కారణాలుగా ఉంటున్నాయి. బహుశా అందుకే ప్రతి నెలా టాప్ 10 అత్యధిక విక్రయాలు జరిపే కార్లను పరిశీలిస్తే అందులో 7 కార్లు కచ్చితంగా మారుతి సుజుకి కంపెనీవే ఉంటాయి. ఈ కంపెనీ కార్లే విక్రయాల్లో ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. ఇతర కంపెనీ కార్లకు ఆస్కారమివ్వవు. ఇప్పుడు మరోసారి మారుతి సుజుకి కంపెనీకు చెందిన ఓ కారు..వేగన్‌ఆర్ అమ్మకాల్ని దాటేసి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం మారుతి సుజుకి బలేనో దేశంలో అత్యధిక విక్రయాలు నమోదు చేసిన కారుగా ఉంది. మార్చ్ నెలలో 4వ స్థానంలో ఉన్న ఈ కారు మే వచ్చేసరికి మొదటి స్థానంలో ఉన్న వేగన్‌ఆర్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచింది.
మే నెల అమ్మకాల్లో బలెనో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. మారుతి వేగన్‌ఆర్ మూడవ స్థానానికి పడిపోయింది. మే నెలలో మారుతి సుజుకి బలేనో 18,733 యూనిట్లు విక్రయాలు జరిపితే రెండవ స్థానంలో నిలిచిన మారుతి స్విఫ్ట్ 17,300 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. ఇక మూడవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి వేగన్‌ఆర్ 16,300 యూనిట్లు అమ్మకాలు సాధించింది.
మారుతి సుజుకి బలేనో ధర, ఇంజన్
మారుతి సుజుకి బలేనో ధర 6.61 లక్షల నుంచి ప్రారంభమై 9.88 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఇంజన్‌కు 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 5 స్పీడ్ ఏఎంటీ రెండూ ఉన్నాయి. మైలేజ్ కోసం ఐడియల్ స్టార్ట్, స్టాప్ టెక్నాలజీ ఉంది.
మే నెలలో టాప్ 10 విక్రయాలు జరిపిన కార్లు
1. మారుతి బలేనో 18.700 యూనిట్లు
2. మారుతి స్విఫ్ట్ 17,300 యూనిట్లు
3. మారుతి వేగన్‌ఆర్ 16, 300 యూనిట్లు
4. హ్యుండయ్ క్రెటా 14,449 యూనిట్లు
5. టాటా నెక్సాన్ 14,423 యూనిట్లు
6. మారుతి బ్రెజా 13,398 యూనిట్లు
7. మారుతి ఈకో 12,800 యూనిట్లు
8. మారుతి డిజైర్ 11, 300 యూనిట్లు
9. టాటా పంచ్ 11, 100 యూనిట్లు
10. మారుతి ఆటింగా 10,500 యూనిట్లు
Also read: Tata Punch EV: త్వరలో విడుదల కానున్న టాటా పంచ్ ఈవీ.. సింగిల్ ఛార్జింగ్‌పై 300 కిమీల ప్రయాణం!
ఈ జాబితాలోని టాప్ 10 కార్లలో 7 కార్లు మారుతి సుజుకి కంపెనీవే కావడం విశేషం. మరోవైపు టాప్ 3 అత్యధిక విక్రయాలు జరిపిన కంపెనీ కూడా మారుతి కంపెనీనే. మధ్యలో 4,5 స్థానాలు తప్పించి తిరిగి 6,7,8 స్థానాలు ఆ తరువాత 10వ స్థానం మారుతి సుజుకిదే కావడం గమనించాల్సిన అంశం. మొదటి స్థానంలో మారుతి బలెనో నిలిచింది.
Also read: Best SUV Cars: దేశంలో 10 లక్షల కంటే తక్కువకు లభించే టాప్ 10 ఎస్‌యూవీ కార్లు ఇవే 6 లక్షలకే ఎస్‌యూవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook