Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.79వేలు విలువ చేసే ఐఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Offers: మీరు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 01:08 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు
  • యాపిల్ ఐఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • రూ.79 వేలు విలువ చేసే ఐఫోన్ 13 చౌక ధరకే అందుబాటులో
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.79వేలు విలువ చేసే ఐఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. చౌక ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.79,900 విలువ చేసే ఐఫోన్‌ 13 (మిడ్‌నైట్, 128 జీబీ)ని కేవలం రూ.54,449కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఆఫర్ :

యాపిల్ ఐఫోన్‌ 13 (మిడ్‌నైట్, 128 జీబీ) సాధారణ ధర రూ.79,900. ఫ్లిప్‌కార్ట్‌ దీనిపై 7 శాతం డిస్కౌంట్‌తో రూ.5901 మేర తగ్గింపు అందిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ ఐఫోన్ కేవలం రూ.73,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఐఫోన్ కొనుగోలుకు మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.4 వేలు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలా రూ. 69,999కే ఈ ఐఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ :

యాపిల్ ఐఫోన్‌ 13 (మిడ్‌నైట్, 128 జీబీ)పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.మీ పాత ఫోన్‌ని మార్చుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.15,500 వరకు తగ్గింపు లభిస్తుంది. పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.73,999 విలువ చేసే ఈ ఫోన్‌ని మీరు రూ.58,499కే పొందవచ్చు. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో రూ.4 వేలు తక్షణ పొందించినట్లయితే.. రూ.54,499కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వస్తాయని గుర్తుంచుకోవాలి.

Also Read: Deisel Missing Case: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..దొంగలు ఎవరో తెలుసా..?

Also Read: Repo Rate Hike: రెపో రేటు పెంపు... ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News