Ampere Electric Scooter: భారీ తగ్గిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరలు.. కొత్త ధరలు చెక్‌ చేయండి!

Ampere Electric Scooter Prices Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌పై భారీగా ధరలు తగ్గాయి. వీటిపై ఏకంగా కంపెనీ రూ.10,000 వరకు తగ్గించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 17, 2024, 12:39 PM IST
Ampere Electric Scooter: భారీ తగ్గిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరలు.. కొత్త ధరలు చెక్‌ చేయండి!

Ampere Electric Scooter Prices Cut: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీ తమ EV స్కూటర్స్‌పై ధరలను తగ్గిస్తున్నాయి. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గతంలో పరిచేయం చేసిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. అలాగే ఈ కంపెనీలకు సంబంధించిన కొన్ని ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌పై కూడా భారీగా ధరలు తగ్గాయి. అంతేకాకుండా Magnus LT వేరియంట్‌పై కూడా ధర రూ.9,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఇదే కాకుండా Reo Li Plus, Magnus EX మోడల్‌లు గతంలో కంటే ధర రూ. 10,000 వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన ఫ్లాగ్‌షిప్ Nexus స్కూటర్‌ కూడా అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఏయే స్కూటర్స్‌ ఎంతెంత ధరలతో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మోడల్స్‌ వాటి వివరాలు:
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌పై భారీగా ధరలను తగ్గించింది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి. ఇక తగ్గించిన ధరలు అందుబాటులోకి వస్తే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రియో లి ప్లస్ మోడల్‌ ధర    రూ. 69,900 నుంచి ప్రారంభమై రూ. 59,900తో లభిస్తోంది. ఇక EX మోడల్‌ రూ. 1,04,900 నుంచి మొదలై రూ. 94,900 వరకు, మాగ్నస్ LT రూ. 93,900 నుంచి  ప్రారంభమై రూ. 84,900 వరకు,  Nexus EX రూ. 1,09,000 ధరల్లో లభిస్తోంది. దీంతో పాటు టాప్‌ ఎండ్‌ మోడల్ ST రూ. 1,19,000లకు అందుబాటులో ఉంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ కంపెనీకి సంబంధించిన బేసిక్‌ మోడల్ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్ లో స్పీడ్‌ మోటర్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీనిని కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా కంపెనీ విక్రయిస్తోంది. అలాగే దీని గరిష్ట వేగం 25 కి.మీ. గంటకు ఉంటుందని కంపెనీ వెళ్లడించింది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు  70 కి.మీ. కంటే ఎక్కువ ప్రయాణం చేస్తుంది. ఇక LT, మాగ్నస్ EX మోడల్స్‌ విషయానికొస్తే ఇవి 2.5 mph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇవి రెండు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 80 కి.మీ. నుంచి 100 కి.మీల రేంజ్ మైలేజీని అందిస్తాయి. ఈ రెండింటిలో వేరు వేరు ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Nexus EX, ST ఫీచర్స్‌:
3kWh LFP బ్యాటరీ
4kW మోటార్‌ శక్తి
93 కిమీ నుంచి 136 కిమీ వరకు మైలేజీ పరిధి
గరిష్టంగా 100mph వేగం
సులభంగా ఛార్జ్‌ అవుతుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News