Maruti Dzire Offer: 10 లక్షల కారు కేవలం 62 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి ఇలా

Maruti Dzire Offer: కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ఫాస్టెస్ట్ సెల్లింగ్ బెస్ట్ కారుని కేవలం 62 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారని పొరపాటు పడవద్దు. కొత్త కారే. నమ్మలేకపోతున్నారా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 08:57 PM IST
Maruti Dzire Offer: 10 లక్షల కారు కేవలం 62 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి ఇలా

Maruti Dzire Offer: కారు కొనాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బడ్జెట్ కారణంగా చాలామంది వెనుకంజ వేస్తుంటారు. ఫైనాన్స్ సదుపాయం అందుబాటులో వచ్చాక కార్ల వినియోగం బాగా పెరిగింది. జనం పెద్దఎత్తున కార్ల కొనుగోలు చేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.

కార్లలో సెడార్ కారుకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా హుందాగా ఉంటుంది. లగ్జరీ కారు సెగ్మెంట్‌లో కూడా సెడాన్ కారుకే డిమాండ్ ఎక్కువ. అందులో మారుతి కంపెనీ సెడాన్ కారంటే ఇక వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరంలేదు. ఫాస్టెస్ట్ సెల్లింగ్ బెస్ట్ కారు ఇది. మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ వేరియంట్ కారుకు మార్కెట్‌లో మంచి పేరుంది. మారుతి సుజుకి డిజైర్ VXI CNG 8,39,250 రూపాయల ఎక్స్ షోరూం ధర నుంచి ప్రారంభమై ఆన్‌రోడ్ 9,41,639 రూపాయల వరకూ ఉంటుంది. బడ్జెట్ ఎక్కువగా ఉందని ఆలోచించవద్దు. కేవలం 62 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లే అద్భుత అవకాశముంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ఎలాగో చూద్దాం...

ఆన్‌లైన్ పైనాన్స్ ప్రకారం ఇది సాధ్యమే. బ్యాంకు ఏడాదికి 9.8 శాతం వడ్డీ చొప్పున 7,79,639 రూపాయల వరకూ రుణం అందిస్తుంది. అంటే మీరు దాదాపుగా 60-70 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత ఐదేళ్లపాటు అంటే 60 నెలల వరకూ నెలకు 18,603 రూపాయలు ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ ప్రత్యేకతలు

మారుతి సుజుకి డిజైర్‌లో 1197 సిసి సింగిల్ ఇంజన్ ఉంది. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 76.43 బీహెచ్‌పి పవర్, 98.5 ఎన్ఎం టార్క్ శక్తిని అందిస్తుంది. సీఎన్జీ వెర్షన్ మైలేజ్ కిలోకు 31.12 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్,ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

Also read: Income tax Dates: ఇన్‌కంటాక్స్ విషయంలో మే నెలలో ముఖ్యమైన తేదీలు, గుర్తుంచుకోవల్సిన అంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News