Maruti Baleno Regal Edition: కళ్లు తిరిగే ఫీచర్లతో మారుతి బలేనో కొత్త ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతంటే

Maruti Baleno Regal Edition: దేశంలో మారుతి సుజుకి కార్లకు ప్రత్యేక నమ్మకం, డిమాండ్ ఉన్నాయి. అందుకే దాదాపు అన్ని మోడల్స్ సక్సెస్ అవుతుంటాయి. ఇటీవల మార్కెట్‌లో క్రేజ్ సంపాదించుకున్న మారుతి బలెనో కొత్త ఎడిషన్ లాంచ్ చేసి హల్‌చల్ చేస్తోంది. దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2024, 09:15 PM IST
Maruti Baleno Regal Edition: కళ్లు తిరిగే ఫీచర్లతో మారుతి బలేనో కొత్త ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతంటే

Maruti Baleno Regal Edition: దీపావళికి ముందే మారుతి సుజుకి కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారైన మారుతి బలేనో కొత్త ఎడిషన్ రీగల్ ఎడిషన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ కారు మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. మారుతి బలేనో రీగల్ ఎడిషన్ ఫీచర్లు చూస్తే మతి పోవల్సిందే. మారుతి బలేనో రీగల్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి కంపెనీ ఇటీవలే గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. యాక్సెసరీస్ పెంచి డొమినియన్ ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. ఇప్పుుడు బలేనో రీగల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్‌లో కస్టమర్లకు కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ కిట్ లభిస్తుంది. దీపావళి పండుగ సీజన్ పురస్కరించుకుని మారుతి సుజుకి కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మేన్యువల్, ఆటోమేటిక్, సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ కిట్‌లో ఫ్రంట్ అండర్ బాడీ స్పైలర్, రేర్ అండర్ బాడీ స్పైలర్, డ్యూయల్ టోన్ సీట్ కవర్, 3డీ మ్యాట్, సైడ్ మోల్డింగ్, మడ్ ఫ్లాప్, 3డి బూట్ మ్యాట్, క్రోమ్ గార్నిష్ ఉన్నాయి. గ్రిల్, రేర్ పోర్షన్, స్టీరింగ్ కవర్, వాక్యూమ్ క్లీనర్, బాడీ కవర్, నెక్సా కుషన్, డోర్ వైజర్, సిల్ గార్డ్, రేర్ పార్శిల్ ట్రే, విండో కర్టెన్స్, టైర్ ఇన్‌ఫ్లేటర్, లోగో ప్రాజెక్టర్ ల్యాంప్, క్రోమ్ డోర్స్ ఉంటాయి. వేరియంట్‌ను బట్టి ఈ ప్యాకేజ్ ధర 45,829 రూపాయల నుంచి 60,199 రూపాయలు ఉండవచ్చు.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 90 హెచ్‌పి, 113 ఎన్ఎం, 1.2 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో మళ్లీ డెల్టా, జెటా వేరియంట్లు ఉన్నాయి. దీంతోపాటు సీఎన్జీ కిట్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి. మారుతి బలేనో ప్రారంభ ధర 6.66 లక్షల నుంచి ప్రారంభమై 9.83 లక్షల వరకు ఉంటుంది. 

Also read: DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News