AP Liquor Prises: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధనాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొన్ననే లాటరీ ద్వారా లబ్ధి దారులను ఎంపిక చేసారు. అంతేకాదు ఏపీలో కొత్త మద్యం ధరలను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రోజు నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.
అంతేకాదు ప్రతి మద్యం దుకాణంలోనూ ప్రీమియం బ్యాండ్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు 89, 882 దరఖాస్తుల వస్తాయి. అందులోంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇక విస్కీ బ్రాండ్ సెగ్మెంట్ లో భాగంగా.. హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎం.ఎల్ . రూ. 130 ఉంది. ఇదే బ్రాండ్ 750 ఎం.ఎల్ రూ. 750 గా ధర నిర్ణయించారు. నేవీ బ్లూ క్లాసిక్ విస్కీ ధర.. 180 ఎం.ఎల్. ..రూ. 150, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ ధర రూ. 750 ఎం.ఎల్ రూ. 490 ఉంది.
బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ధర గరిష్ఠంగా 750 ఎం.ఎల్ రూ. 2500 ఉంది. బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 350 ఎం.ఎల్ రూ. 1250 గా నిర్ణయించారు. మొత్తంగా రూ. 130 నుంచి రూ. 2500 మధ్య స్కాచ్ విస్కీ ధర ఉంది.
బ్రాండీ సెక్షన్ లో కైరోన్ రేర్ బ్రాండీ 180 ఎం.ఎల్ ధర రూ.. 300గా ఉంది. నెపోలియన్ సెయింట్ బ్రాండ్ విస్కీ ధర 750 ఎం.ఎల్.. రూ. 1180గా ఉంది. మొత్తంగా బ్రాండీ సెక్షన్ లో రూ. 300 నుంచి 1200 వరకు వివిధ బ్రాండ్ల ధరలున్నాయి.
రమ్ సెక్షన్ విషయానికొస్తే.. ఓల్డ్ మంక్ స్పెషల్ XXX రేర్ రమ్ 180 ఎం.ఎల్ ధర.. రూ. 230గా నిర్ణయించారు. గరిష్ఠంగా బకార్డి లైమన్ అల్ట్రా ప్లాటినమ్ ఒరిజినల్ సిట్రస్ రమ్ 750 ఎం.ఎల్ ధర .. రూ. 1320గా ఉంది.
వోడ్కా సెగ్మెంట్ లో మ్యాజిక్ మూమెంట్స్ గ్రీన్ ఆపిల్ ప్రీమియమ్ ఫ్లేవరడ్ 180 ఎం.ఎల్ ధర.. రూ. 230గా ఉంది. జునో సూపీరియర్ పింక్ వోడ్కా 750 ఎం.ఎల్ ధర.. రూ. 1030గా ఉంది.
వైన్ సెగ్మెంట్స్ లో ఫ్రాతెల్లి షిరాజ్ 180 ఎం.ఎల్.. రూ. 410గా ఉంది. గరిష్టంగా రూ. 2880గా ధరలున్నాయి. జిన్ సెగ్మెంట్ లో ఒకే ఒక బ్రాండ్.. 750 ఎం.ఎల్.. రూ. 2250గా ధరలు నిర్ణయించారు.
బ్రీజర్ సెగ్మెంట్ లో బ్రీజర్ ప్లాటినమ్ టాంగీ క్రాన్ బెర్రీ ధర.. రూ. 130గా ఉంది. బీర్ సెక్షన్ లో కింగ్ ఫిషర్, నాగ్ ఔట్ తదితర బ్రాండ్స్ అన్ని రూ. 180 నుంచి గరిష్ఠంగా రూ. 270 వరకు ఉన్నాయి.