PM Kisan 14th Installment Date 2023: దేశంలో పది కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్‌ను చెప్పబోతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత త్వరలో విడుదల చేయబోతునట్లు కేంద్రం పేర్కొంది. ఆర్హులైన రైతుల ఖాతాల్లో 14వ విడత కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు ఖాతాలో జమకానున్నాయి. నిపుణుల సమాచారం మేరకు.. 14 వ విడత సమ్మాన్ నిధిని కేంద్ర జూన్ రెండవ వారం విడుదల చేయనుంది. జూన్ 15లోగా 14వ విడుత ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
13వ విడత ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులను 2023 ఫిబ్రవరి 27న ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే..అర్హులైన రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి 6000 ఆర్థిక సహాయం అదిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును 3 వాయిదాల్లో రైతులకు అందిస్తోంది. మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై వరకు అందించగా.. రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు అందించింది కేంద్ర ప్రభుత్వం. మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు రైతుల ఖాతల్లో డబ్బు జమ చేయనుంది.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 2018లో ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం.. అవసరమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కేవలం పరిమిత భూమి కలిగిన రైతు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని పొంది పంటకు అవసరమైన రసాయనాలను కొనుగోలు చేసేందుకు వినియోగించాలని కేంద్ర పేర్కొంది.
లబ్ధిదారులు పథక ద్వారా డబ్బును పొందడానికి తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా లబ్ధిదారుల ఖాతాలను నో-యువర్-కస్టమర్ (KYC)కి లింక్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ చేయని వారికి ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ యోజన 13వ విడత డబ్బులు పడలేదని కేంద్రం తెలిపింది. అయితే 14వ విడత డబ్బులు పొందడాని తప్పకుండా నో-యువర్-కస్టమర్ లింక్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook