SBI special offers on car loans, gold loans, personal loans: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా కారు లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రీటేల్ లోన్స్‌తో పాటు పలు డిపాజిట్ స్కీమ్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది.
ఇప్పటికే హోమ్ లోన్స్‌పై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేసిన ఎస్బీఐ.. తాజాగా కారు లోన్లపై సైతం ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా తొలగించింది. అంతేకాకుండా 90% ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది. కారు లోన్లపై ఆఫర్స్ ఇంతటితో అయిపోలేదండోయ్.. యోనో యాప్‌పై కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీ రేటుపై ప్రత్యేకంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గింపు కూడా వర్తిస్తుంది. అంటే అత్యల్పంగా ఏడాదికి 7.5% వడ్డీ రేటుతో కారు లోన్ (car loans interest rates) పొందవచ్చన్నమాట.
ఇక గోల్డ్ లోన్ కస్టమర్స్‌కి అందించే ఆఫర్స్ విషయానికొస్తే.. గోల్డ్ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేటు కంటే 75 బేసిస్ పాయింట్స్ తక్కువకే అందిస్తున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. అంటే.. ఏడాదికి 7.5% వడ్డీ రేటుతో గోల్డ్ లోన్ (Gold loans interest rates) లభించనుందన్నమాట.
Also read : Interest rates on Gold loans: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: ఎస్బీఐలో బంగారంపై రుణాలు.. యోనో యాప్‌తో వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ఆఫర్స్
గోల్డ్ లోన్‌పై సైతం ఆఫర్స్ అప్పుడే అయిపోలేదు. ఎస్బీఐ యోనో యాప్‌పై (SBI YONO) గోల్డ్ లోన్ కోసం అప్లై చేసే వారికి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఎస్బీఐ వివరించింది.
పర్సనల్ లోన్స్, పెన్షన్ లోన్స్ (Pension loans) కోసం దరఖాస్తు చేసుకునే వారికి 100% ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.
కొవిడ్-19పై పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రాంట్ లైన్ వారియర్స్ అయిన హెల్త్ కేర్ వర్కర్స్‌కి పర్సనల్ లోన్లపై (Personal loans) వడ్డీ రేటును ప్రత్యేకంగా 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి అందిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
త్వరలోనే హెల్త్ కేర్ వర్కర్స్‌కి (Health care workers) కారు లోన్లు, గోల్డ్ లోన్లపైనా వడ్డీ రేటు తగ్గించనున్నట్టు ఎస్బీఐ ఈ ప్రకటనలో పేర్కొంది.
Also read : SBI customers: ఎస్బీఐలో ఈ ఖాతాదారులకు Good news.. RuPay debit cards తో ఇన్సూరెన్స్ కవర్
రీటేల్ లోన్స్ తరహాలోనే రీటేల్ డిపాజిట్ స్కీమ్స్‌పై ఎస్బీఐ అదనపు వడ్డీ (SBI Interest rates) అందిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావని వేడుకలను పురస్కరించుకుంటూ 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాల పరిమితితో డిపాజిట్ పథకాలు ప్రవేశపెట్టినట్టు ఎస్బీఐ ప్రకటించింది.
పండగల సీజన్ (festival season 2021) సమీపిస్తున్న తరుణంలో కస్టమర్స్‌కి కారు లోన్లు, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు (Interest rates on car loans, Gold loans, Personal loans) తగ్గించి ఇస్తుండటంపై తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఎస్బీఐ రీటేల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్. శెట్టి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook