Petrol For Cheap Cost: తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి

Petrol Diesel Rates For Low Price: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రూ.100కు పైనే లభిస్తుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ ట్రిక్ పాటించి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ పొందండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 04:37 PM IST
Petrol For Cheap Cost: తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి

Petrol Diesel Rates For Low Price: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. కానీ ధరలు మాత్రం సామాన్యులకు భారంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ రూ.100 పైనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీకో గుడ్ న్యూస్. ఓ చిన్న ట్రిక్ ఉపయోగించి మీరు తక్కువ ధరకే పెట్రోల్ పొందొచ్చు. బీపీసీఎల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుంది.

బీపీసీఎల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో మీరు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా BPCLపెట్రోల్ పంపులో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుపై 4.25 శాతం వాల్యూ బ్యాక్ పొందవచ్చు. ఇందులో రివార్డ్ పాయింట్లు, సర్‌ఛార్జ్ మినహాయింపులు ఉంటాయి. పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోళ్లపై 13x రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. ఇది మొత్తం 4.25 శాతం వాల్యూ బ్యాక్‌లో 3.25 శాతానికి సమానం. అదే సమయంలో రూ.4 వేల వరకు ప్రతి లావాదేవీపై ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. మీరు ఒక బిల్లింగ్ సైకిల్‌లో గరిష్టంగా రూ.100 సర్‌ఛార్జ్ మాఫీని పొందవచ్చు. ఇది రూ.1200 వార్షిక పొదుపుకు సమానం. అయితే.. మీరు BPCL పెట్రోల్ పంపులో మాత్రమే ఈ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది.

బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును బ్యాంకులు ఉచితంగా ప్రొవైడ్ చేయవు. ఈ కార్డుకు జాయినింగ్ ఫీజు 499 రూపాయలు ఉంటుంది. కార్డును రెన్యూవల్ చేసుకోవాలంటే కూడా రూ.499 చెల్లించాలి. ఫస్ట్ జాయినింగ్ బోనస్‌గా మీకు 500 రూపాయల విలువైన వెల్‌కమ్‌ గిఫ్ల్ లభిస్తుంది. జాయినింగ్ ఫీజు చెల్లించిన తరువాత.. మీరు రూ.500 విలువైన 2 వేలు యాక్టివేషన్ బోనస్ రివార్డ్ పాయింట్‌లను పొందుతారు.

ఫీజు చెల్లించిన 20 రోజుల తర్వాత రివార్డ్ పాయింట్‌లు క్రెడిట్ అవుతాయి. వీటిని బీపీసీఎల్ అవుట్‌లెట్ల నుంచి ఇంధనం కొనుగోలు చేసి రెడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో మీరు రూ.500 విలువైన పెట్రోల్ లేదా డీజిల్‌ను కూడా ఉచితంగా కొనుగోలు చేయవచ్చు. మీకు దగ్గరలో బీపీసీఎల్ పెట్రోల్ బంకులు ఉంటే.. ఈ క్రెడిట్ కార్డును తీసుకుని తక్కువ ధరకే పెట్రోల్‌ను పొందండి. 

Also Read: Bengaluru Man Murdered Case: పెళ్లికి ముందు ఆమెకు 15 మంది లవర్స్‌.. మహిళ రాసలీలలు.. భర్త హత్యకేసులో ఆసక్తికర విషయాలు  

Also Read: Nithya Menen Pregnancy : ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన నిత్యా మీనన్.. ఏంటి? పెళ్లయిందా? అంటూ నెటిజన్లు షాక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News