Vivo Y30 5G features: వివో నుంచి మరో అద్భుతమైన ఫోన్, అద్భుత ఫీచర్లతో 20 వేలలోపే ధర

Vivo Y30 5G features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర 20వేలలోపే ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2022, 05:02 PM IST
Vivo Y30 5G features: వివో నుంచి మరో అద్భుతమైన ఫోన్, అద్భుత ఫీచర్లతో 20 వేలలోపే ధర

Vivo Y30 5G features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర 20వేలలోపే ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

త్వరలో ఇండియాలో 5జి లాంచ్ కానుంది. ఇప్పటికే వివిధ కంపెనీలు 5జి స్మార్ట్‌ఫోన్లు ప్రవేశపెట్టేస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్తగా లాంచ్ చేసిన 5జి స్మార్ట్‌ఫోన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ మోడల్ పేరు..Vivo Y30 5G.తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు కలిగిన 5 జి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ డిజైన్, కలర్ అద్భుతంగా ఉన్నాయి. Vivo Y30 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధర ఎంతనే వివరాలు తెలుసుకుందాం..

Vivo Y30 5G ధర

వివో ఇటీవల ఈ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Vivo Y30 5G లాంచ్ చేసింది. ఇందులో లేటెస్ట్ ఫీచర్లు ఉండటమే కాకుండా 5జి సౌకర్యం కలిగి ఉంది. అదే సమయంలో 20 వేలకంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది. ఇంకా అక్కడే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5జీతో పాటు 128 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఇదొక బడ్జెట్ ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ధర కేవలం 18 వేల 923 రూపాయలే. బ్లాక్, ర్యాంబో ఫ్యాంటసీ రంగుల్లో లభిస్తోంది. 

Vivo Y30 5G ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ 6.51 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే, హెచ్‌డి 720x1600 పిక్సెల్ రిసొల్యూషన్, 20:9  యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. ఇందులో 6 జిబి ర్యామ్, 2 జిబి పెంచుకునే సౌకర్యంతో వచ్చింది. బ్యాటరీతో పాటు 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. ఫ్రంట్ కెమేరా 8 మెగాపిక్సెల్ కాగా రేర్ కెమేరా 50 మెగాపిక్సెల్‌గా ఉంది. 

Also read: Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ ఇవాళే ముగింపు.. స్మార్ట్ వాచీలపై 75 శాతం వరకు తగ్గింపు..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News