HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం

Vijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 

Written by - Vishnupriya | Last Updated : May 9, 2024, 12:05 AM IST
HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం

Vijay Deverakonda Birthday : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు. కొన్నిసార్లు తన మంచి పనులతో.. మరికొన్ని సార్లు కాంట్రవర్సీలతో ఎలాగోలా ఎల్లప్పుడూ వార్తల్లో నిలబడే.. ఈ రౌడీ హీరో పుట్టినరోజు సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..

Add Zee News as a Preferred Source

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన ప్రయాణం

విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ మొదట్లో కేవలం చిన్న పాత్రలకి మాత్రమే పరిమితమయ్యారు. 2011లో నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ.. 2012 లో  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చాలా చిన్న పాత్ర పోషించారు. ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 

పట్టువదలని విక్రమార్కుడు

ఆ తరువాత కూడా ఈ హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి.. మెయిన్ హీరోగా అవకాశాలు అందుకోలేకపోయారు. అయినా అలుపెరగకుండా పట్టు వదలని విక్రమార్కుడి లాగా సినిమా అవకాశాల కోసం ఎంతగానో ట్రై చేస్తూ తన కెరీర్ కొనసాగించారు ఈ హీరో..

నాని సినిమాతో మొదటి బ్రేక్

విజయ్ దేవరకొండ కి 2015 లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో కొంచెం పేరు తెచ్చిపెట్టింది. నాని హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించినా కానీ.. ఆ పాత్రకి ఆ సినిమాలో ప్రాధాన్యత ఉండటంతో విజయ్ దేవరకొండ కి కూడా మంచి పేరు వచ్చింది. 

పెళ్లిచూపులతో మొదటి కమర్షియల్ సక్సెస్..

ఇక 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో హీరో అయిపోయాడు.  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకి మంచి విజయం తెచ్చి పెట్టడమే.. కాకుండా మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. కాగా 2017 లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. 

బోలెడు వివాదాల మధ్య విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విజయ్ దేవరకొండ రేంజ్ ని విపరీతంగా పెంచేసింది. ఆ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండ కి రౌడీ బాయ్ ట్యాగ్ కూడా చింది. అప్పటినుంచి విజయ్ దేవరకొండ గురించి టాలీవుడ్ లో తెలియనివారు లేరు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు ఈ హీరో. ఇక మళ్ళీ గీతాగోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. 

బాలీవుడ్ హీరోయిన్స్ కి సైతం క్రష్

అర్జున్ రెడ్డి సినిమా విడుదల తరువాత.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం విజయ్ పేరు మారుమోగింది. విజయ్ దేవరకొండ హిందీలో ఎటువంటి సినిమాలో నటించకపోయిన.. అక్కడ హీరోయిన్ సైతం ఈ హీరో తమ ఫేవరెట్ హీరో అంటూ చెప్పసాగారు. 

రౌడీ హీరోకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్

నోటా సినిమా తో తమిళ్లో కూడా అడుగు పెట్టారు కానీ.. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక టాక్సీవాలా సినిమాతో మళ్లీ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈ మధ్య మాత్రం ఈ హీరోకి చెప్పుకోదగిన హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. 

ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ మీద ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే ఖుషి సినిమాతో మళ్లీ మంచి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ.  కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. 

ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడేవాడిని అని చెప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రతి సంవత్సరం దేవర శాంతా అనే కాంటెస్ట్ తో తన అభిమానులను కొత్త సంవత్సరం సందర్భంగా గిఫ్ట్లు ఇచ్చి సంతోష పరుస్తూ ఉంటాడు. ఎంత స్టార్ స్టేటస్ ఉన్నా ఇంకా పక్కింటి కుర్రాడిలానే అందరితో మంచిగా ప్రవర్తించే విజయ్ దేవరకొండ ఇవాళ మే 9న తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 

అభిమానులు సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కచ్చితంగా మళ్ళీ మంచి హిట్ అందుకుంటాడు అని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. 

హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..

Also Read: Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?

Also Read: KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్‌

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News