South Glass Company: మంటల్లో బూడిదైపోయిన 6 మంది కార్మికులు.. షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం

 తెలంగాణలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. గత నెలలో వర్షానికి పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటన మరువకముందే తాజాగా ఓ పరిశ్రమలో చెలరేగిన ప్రమాదం వలన ఏకంగా ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రమాదం సమాచారం తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Last Updated : Jun 28, 2024, 08:00 PM IST
South Glass Company: మంటల్లో బూడిదైపోయిన 6 మంది కార్మికులు.. షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం

South Glass Company Tragedy: తెలంగాణలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. గత నెలలో వర్షానికి పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటన మరువకముందే తాజాగా ఓ పరిశ్రమలో చెలరేగిన ప్రమాదం వలన ఏకంగా ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రమాదం సమాచారం తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: Brutally Killed: దారుణం.. ఛాయ్‌ పెట్టలేదని కోడలిని చంపిన అత్త

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఉన్న స్థానిక సౌత్‌ గ్లాసు ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం సాయంత్రం పూట కంప్రెషర్‌ పేలింది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో ఆరుగురు మృతి చెందారు. 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా.. క్షతగాత్రులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Also Read: Suraj Revanna: కాంచనలా మారిన మాజీ ప్రధాని మనువడు.. అమావాస్య రోజు చీర, గాజులు వేసుకుని

కాగా ప్రమాద తీవ్రత చూస్తే మరింత మృతులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వారిని అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కాగా కంప్రెషర్‌ పేలుడుతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు. కాగా మృతులంతా ఒడిశా, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రమాదం విషయం తెలుసుకుని వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు ఆదేశించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

 

Trending News