Aarnav - Divya: నాది వివాహేతర సంబంధం కాదు.. నా భార్యకు అతనితో గర్భం.. ఆర్నవ్ సంచలనం!

Aarnav Sensational Allegations on his wife Divya Sreedhar:  తనకు, తన బిడ్డకు తన భర్త నుంచి ప్రాణహాని ఉందని తమిళ సీరియల్ నటి దివ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భర్త ఆర్నవ్ తన భార్య మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 8, 2022, 08:21 PM IST
Aarnav - Divya: నాది వివాహేతర సంబంధం కాదు.. నా భార్యకు అతనితో గర్భం.. ఆర్నవ్ సంచలనం!

Aarnav Sensational Allegations on his wife Divya Sreedhar: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తూ ఉండడం షాక్ కలిగిస్తోంది. తాజాగా తమిళ సీరియల్ నటి ఒకరు తన భర్త నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందంటూ చెన్నై పోలీసులను ఆశ్రయించింది. సదరు సీరియల్ నటి పేరు దివ్య శ్రీధర్. తమిళ సీరియల్స్ తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల కేలాన్కనమని అనే సీరియల్ లో నటిస్తోంది.

ఆ సీరియల్లో తన కోస్టార్ అయిన ఆర్నవ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. తర్వాత ప్రేమ పెళ్లి చేసుకుని కొత్త కాపురం కూడా పెట్టారు. అయితే తనతో కొన్నాళ్ళు ఆర్నవ్ బాగానే ఉన్నా తర్వాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని దివ్య ఆరోపిస్తోంది. నిజానికి తాము డేటింగ్ లో ఉన్నప్పుడే ఆమెతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే తాను వివాహం చేసుకున్నానని, అయితే పెళ్లి తర్వాత కూడా ఆర్నవ్ తీరు మారలేదని ఆమె ఆరోపిస్తోంది.

తాజాగా అతను మరో నటితో రెడ్ హ్యాండెడ్ గా తనకు చిక్కాడని ఇదేమిటి అని ప్రశ్నిస్తే వెనక్కి తగ్గాల్సింది పోయి ఎదురు తనపైనే దాడి చేశాడని ఆమె ఆరోపించింది. తన బిడ్డకు తనకు రక్షణ కల్పించమని పోలీసులు ఆమె కోరింది. ఇక తాజాగా ఈ విషయంలో ఆర్నవ్ తెర మీదకు వచ్చాడు. దివ్య తన మీద చేసిన ఆరోపణలు నిజం కాదని తాను వివాహేతర సంబంధం పెట్టుకోలేదు కానీ తన భార్యనే తన దగ్గర ఒక విషయం దాచిందని చెబుతున్నాడు. కర్ణాటక చెందిన దివ్య 2012లోనే పెళ్లి చేసుకుందని మొదటి భర్తతో ఆమెకు పాప కూడా జన్మించిందని ఆర్నవ్ ఆరోపిస్తున్నాడు.

భర్తతో మనస్పర్ధలు రావడంతో అప్పుడు విడాకులు తీసుకుని తనతో డేటింగ్ కు దిగిందని పేర్కొంది. ఆ తర్వాత గర్భం దాల్చడం వంటి విషయాలు జరిగాయని అయితే తనకు ముందే పెళ్లై పాప ఉన్న విషయం నా దగ్గర దాచిందని ఆర్నవ్ అంటున్నారు. తాను ఆమె మీద ఎలాంటి దాడి చేయలేదని, తమ పెళ్ళికి సంబంధించిన పోస్టులు  సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయమని అడిగానని కుటుంబ సభ్యులు అనుమతి వచ్చాక పోస్ట్ చేయవచ్చు అని అడిగితే తన మీద ఇలా తప్పుడు కేసులు పెట్టిందని ఆర్నవ్ కొత్త వాదన తేరి మీదకు తీసుకువచ్చాడు. 

Also Read: Balakrishna House Kabja: సర్కార్ స్థలం కబ్జా చేసిన బాలకృష్ణ.. సోషల్ యాక్టివిస్ట్ సంచలన ఆరోపణలు!

Also Read: Godfather fake Collections: చిరు నోట ఫేక్ లెక్కలా.. రామ్ చరణ్ మాటలేమయ్యాయి.. ఇలా అయితే ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x