Animal Trailer: లవర్ బాయ్ నుంచి రాక్షసుడిగా మారిన రణబీర్ కపూర్, విధ్వంసం రేపుతున్న యానిమల్ ట్రైలర్

Animal Trailer: బాలీవుడ్‌లో లవర్ బాయ్ గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్‌లో మరో కోణం చూపించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్‌గా అత్యంత భయంకరంగా విశ్వరూపం ప్రదర్శించాడు రణబీర్ కపూర్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2023, 03:13 PM IST
Animal Trailer: లవర్ బాయ్ నుంచి రాక్షసుడిగా మారిన రణబీర్ కపూర్, విధ్వంసం రేపుతున్న యానిమల్ ట్రైలర్

Animal Trailer: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విశ్వరూపం చూడాలంటే సినిమా మొత్తం చూస్తే జడుసుకోవడం ఖాయం. అందుకే ఈ మూడున్నర నిమిషాల ట్రైలర్ చూస్తే చాలు వణుకుపుడుతుంది. రణబీర్ కపూర్ తాజా పాన్ ఇండియా సినిమా యానిమల్ ట్రైలర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 

విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు నేరుగా బాలీవుడ్ సినిమాతో సంచలనానికి సిద్ధమయ్యాడు. రణబీర్ కపూర్‌‌ను కొత్తకోణంలో అత్యంత భయంకరంగా చూపిస్తూ యానిమల్‌గా మార్చేశాడు. డిసెంబర్ 1న ధియేటర్లలో విడుదల కానున్న యానిమల్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల హల్‌చల్ చేస్తోంది అనేకంటే అందర్నీ భయపెడుతోందని చెప్పాలి. మూడున్నర నిమిషాలు కట్ చేసిన ట్రైలర్ సినిమా ఎంత భయంకరంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. అటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఇటు వయోలెన్స్ ఉండే సినిమా ఇది. 

సాధారణంగా ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలిసిపోతుంది. కానీ యానిమల్ సినిమా ట్రైలర్ చూస్తే పల్స్ రేట్ పెరిగిపోతుంది. ఊపిరి ఆడదు. పూర్తి ఇంటెన్సిటీతో ఉండే యానిమల్ ట్రైలర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఒక్కసారి ట్రైలర్ చూస్తే ఇక సినిమా చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అర్జున్ రెడ్డి తరువాత మరో సెన్సేషనల్ హిట్ కానుంది సందీప్ రెడ్డి వంగాకు. మూడున్నర నిమిషాల ట్రైలర్‌లోనే విధ్వంసం రేపితే మొత్తం సినిమాలో రణబీర్ ఎంతటి అరాచకం సృష్టిస్తాడో సినిమా చూస్తేనే తెలుస్తోంది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News