Actresses Who are Chain Smokers: సాధారణంగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం, బహిరంగంగా ధూమపానం చేసిన వారికి జైలు శిక్ష తప్పదు..అంటూ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా సినిమాలు థియేటర్లలో వచ్చేటప్పుడు యాడ్స్ వేస్తారు. సినిమాలలో హీరో హీరోయిన్లు ధూమపానం చేసేటప్పుడు కూడా కింద షార్ట్ హెడ్లైన్స్.. రూపంలో ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. అయితే అవన్నీ సినిమాలలో నటీ నటులు చేస్తున్నప్పుడు ఇలాంటి టైటిల్స్ అవసరమా.. ముందు సెలబ్రిటీలు మారాలి అంటూ అభిమానులు సైతం తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే సినిమాలలోనే కాదు రియల్ గా కూడా కొంతమంది.. హీరోలు ధూమపానం చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. హీరోలే కాదు ఎంతో మంది హీరోయిన్స్ కూడా ధూమపానానికి బానిసలైన వారే.
ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే బాలీవుడ్ హీరోయిన్ లు చైన్ స్మోకర్స్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు. మరి ధూమపానానికి బాగా. అడిక్ట్ అయిన ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
సోనం కపూర్:
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన అందచందాలతో బాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. అలాంటి ఈమె కూడా తరచుగా స్మోకింగ్ చేస్తుందని సమాచారం.. అయితే ఈ మధ్యకాలంలో సిగరెట్ ఎక్కువగా వాడుతూ మరింతగా అడిక్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈమె ఆల్కహాల్ కూడా సేవిస్తుందట. అయితే కేవలం పార్టీలు, ఫంక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆల్కహాల్.. తాగుతానని తెలిపింది.
కంగనా రనౌత్:
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. అంతేకాదు అత్యంత ప్రతిభ కలిగిన బాలీవుడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకొని.. ఇటీవలే ఎంపీగా కూడా పదవి స్వీకారం చేసింది. ఈమె కూడా చైన్ స్మోకర్ అని సమాచారం. చాలా రోజుల నుంచి మానేయాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.. అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
సుస్మితా సేన్..
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ కూడా చైన్ స్మోకర్.. అయితే ఎన్నోసార్లు ఈ అలవాటును మానుకోవాలని.. ప్రయత్నించినా దానిని మాత్రం మానుకోలేకపోయింది. ఎన్నోసార్లు మీడియా ముందు కూడా ధూమపానం సేవిస్తూ కనిపించింది.
విద్యాబాలన్:
బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ ది డర్టీ పిక్చర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది.అయితే ది డర్టీ పిక్చర్స్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ లో భాగంగా ధూమపానం చేసేదాన్ని.. అదే ఇప్పుడు అలవాటుగా మారి చైన్ స్మోకర్ గా మారాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుత కాలంలో ఈ సమస్య నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చింది.
రాణీ ముఖర్జీ:
బాలీవుడ్ ఫేవరెట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా.. అయితే సిగరెట్ లేకుండా ఒక్కరోజు కూడా గడపలేనని స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook