Janhvi Kapoor: మరో క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ.. తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కానుందా?

Nani33: ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్న జాన్వి కపూర్ కి.. ఇప్పుడు తెలుగులో మరొక సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది. శ్రీదేవి కూతురు.. తెలుగులో తెగ జోరు చూపిస్తోందని.. ఇక టాలీవుడ్ లో సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అభిమానులు. అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నాని 33వ చిత్రం లో నటించబోతున్న సమాచారం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 17, 2024, 05:15 PM IST
Janhvi Kapoor: మరో క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ.. తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కానుందా?

Janhvi Kapoor in Nani 33: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  అద్భుతమైన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న జాన్వి కపూర్ ..ఒకవైపు సోషల్ మీడియాలో కూడా  యాక్టివ్ గా ఉంటూ పలు గ్లామర్ ఫోటోషూట్లతో యువతను విపరీతంగా అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరొకవైపు తెలుగులో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది . అందులో భాగంగానే ఎన్టీఆర్,  కొరటాలు శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా  ఎంపికైన విషయం తెలిసిందే. 

అంతేకాదు ఈమె  పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇక తర్వాత రామ్ చరణ్,  బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాలో అవకాశాన్ని పొందినట్లు సమాచారం. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుగులో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలుగులోనే సెటిలైపోయే ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే..ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని నటించబోయే 33వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ వెబ్ సైట్ క్లాప్ బోర్డ్ కథనాల ప్రకారం.. జాన్వి కపూర్ ఇప్పటికే నాని సినిమా కథ కూడా వినిందట. ఆమెకు ఈ కథ బాగా నచ్చడంతో.. ఈ సినిమాకి సైన్ చేసినట్టు వినికిడి.
 

ఇటీవలే నాని హాయ్ నాన్న సినిమాతో  మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నారు.. అలాగే ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ తో ఎలాంటి సినిమా చేస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తుండగా.. శైలేష్ కొలను  దర్శకత్వంలో హిట్ 3 సినిమాలో నటించబోతున్నారు  అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.. కానీ ఇందులో క్లారిటీ లేదు..పైగా  వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను నానినే నిర్మించాల్సి ఉంది.. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 

మరోవైపు దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. అదే సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది అని.. దసరా మూవీ లో సింగరేణి కుర్రాడిగా కనిపించిన నాని.. ఈ సినిమాలో పక్కా హైదరాబాది కుర్రాడిలా కనిపించనున్నాడు అని సమాచారం.  ఇక ఈ సినిమాలో నానికి జోడిగా ఈ ముద్దుగుమ్మ సెలెక్ట్ అయిందట. 

ఏదేమైనా వరుసగా తెలుగు హీరోలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇక్కడే సెటిలైపోయేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News