Ram Charan Upasana: రామ్‌చరణ్‌ గురించి సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన.. దయచేసి అలా చేయకండి

Upasana About Ram Charan: రామ్ చరణ్‌కు సంబంధించి ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. ఆయన సతీమణి ఉపాసన. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై కూడా స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సూపర్ స్పీచ్‌తో అందరి మనసులు గెలుచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 10:01 PM IST
Ram Charan Upasana: రామ్‌చరణ్‌ గురించి సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన.. దయచేసి అలా చేయకండి

Upasana About Ram Charan: టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ జంట మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన. వీరి వైహాహిక జీవితం ప్రారంభమై దశాబ్దంపైగానే గడిచింది. త్వరలోనే ఉపాసన ఓ బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంతోషకర వాతావరణం నెలకొని ఉంది. తాజాగా ఓ ఇంటర్వూలో తమ వైవాహిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించింది ఉపాసన. పారిశ్రామికవేత్తగా కొనసాగుతూనే.. మరోవైపు సమాజ సేవలోనూ ఎల్లప్పుడు ముందుంటారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌తో వైవాహిక జీవితానికి సంబంధించి ఓ రహస్యాన్ని ఉపాసన వెల్లడించారు. చెర్రీ‌ని పెళ్లి చేసుకున్న తరువాత తన లక్ష్యాన్ని సాధించడానికి ఎలా స్పూర్తి పొందారో చెప్పుకొచ్చారు ఉపాసన.మనిషిలో క్రమశిక్షణ ఉంటేనే.. జీవితంలోని ప్రతి విషయంలోనూ ముందుకు సాగుతారని ఉపాసన చెప్పారు. 'చరణ్‌తో పెళ్లి తర్వాత నేను ఒక వ్యక్తిగా మరింత క్రమశిక్షణ నేర్చుకున్నారు. నా లక్ష్యాలపై నాకు స్పష్టత. నేను ఏమి చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు' అని తెలిపారు.

తాను రామ్‌చరణ్‌ షూటింగ్ షెడ్యూల్‌ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తానని అన్నారు. తద్వారా ఇద్దరం సంతోషకరమైన జీవితం గడిపేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. 'మీరు ఎప్పుడైనా మీ సంబంధంలో కొంత క్రమశిక్షణను పాటించండి.. మీరు మీ వ్యాపారాన్ని త్రైమాసిక సమీక్ష చేసినట్లుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమశిక్షణను సమీక్షించండి. అప్పుడు మాత్రమే మీరు జీవితంలోని ప్రతి అంశంలో ముందుకు సాగుతారు..' అని ఉపాసన తెలిపారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై కూడా ఉపాసన స్పందించారు. తాను గోల్డోన్ స్పూన్‌తో పుట్టానని ప్రజలు అనుకుంటారని.. కానీ తమ తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని అన్నారు. రామ్ చరణ్ తానూ తమ పిల్లలకు కూడా అలాగే చేస్తామన్నారు. శ్రమ విలువను అర్థం చేసుకోవడం.. సమాజానికి తిరిగి ఇవ్వడం తమకు అలవాటైందన్నారు. దయచేసి తన గురించి నెగిటివ్‌గా రాసి నెగిటివిటీని వ్యాప్తి చేయకండని కోరారు.

రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఉపాసన ఫౌండేషన్‌తో సహా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇది గ్రామీణ భారతదేశం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మెగా ఫ్యామిలీ అనేక విధాలు ప్రజలకు సేవ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్ ప్రస్తుతం RC15 మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News