Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..

Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 19, 2024, 12:01 PM IST
Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..

Chiranjeevi EX Son in Law Sirish Bhardwaj No More: చిరంజీవి చిన్న కూతురు మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. అప్పట్లో వీళ్లిద్దు హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెద్దలను ఎదిరించి వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో తనను వేధిస్తున్నరాంటూ శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత 2014లో శ్రీజ..  శిరిష్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత వీళ్లిద్దరు మరో వివాహాం చేసుకొని జీవితంలో సెటిలయ్యారు. అప్పట్లో వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు.. చిరంజీవి నటించిన ఓ సినిమాను ఓ సూపర్ హిట్ సినిమాను గుర్తుకు తెచ్చాయని అప్పట్లో కొందరు చెవులు కొరుక్కున్నారు.   ఈ నేపథ్యంలో శ్రీజ మొదటి భర్త లంగ్స్ కారణంగా అనారోగ్యం దెబ్బ తిని  మృతి చెందడం తీవ్ర విషాదకరం.

అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లికి అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉందని అందరు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జీవించి లేడు. అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లి వార్తను ఓ వార్త ఛానెల్ రోజంత అదే బ్రేకింగ్ నడిపి సంచలనం రేపింది. ఆ తర్వాత చిరంజీవి అల్లుడుగా అప్పట్లో శిరీష్ భదర్వాజ్ కు మంచి ఫేమ్ వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత ఈయన ప్రముఖ రాజకీయ పార్టీలో చేరి ఏదో హడావుడి చేసాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు.  ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా ఆయన కనుమరుగయ్యాడు. శ్రిజతో విడాకుల తర్వాత శిరిష్ భరద్వాజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అటు శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహాం చేసుకుంది. ఇక శ్రిజ, శిరీష్ భదర్వాజ్ దంపతకులకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం శ్రీజ దగ్గర ఉంటుంది. మరోవైపు  కళ్యాణ్ దేవ్ తో  శ్రీజ మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శ్రీజ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక శ్రీజ రెండో భర్త ఆ మధ్య  కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదనే చెప్పాలి. ఇక శిరిష్ భరద్వాజ్ విషయానికొస్తే.. ఇతనికో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉన్నట్టు సమాచారం. ఆ వ్యవహారాలను చూసుకుంటూ వుండేవారు. ప్రస్తుతం లంగ్స్ పాడవడంతో తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందడం బాధాకరం. 

Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News