Mohanlal: రజినీకాంత్ తో నటించడానికి నో చెప్పిన హీరో.. అది కూడా శంకర్ సినిమాకి!

Rajinikanth: మలయాళం సీనియర్ స్టార్ హీరోలలో.. ఒకరు అయిన మోహన్ లాల్ కి.. శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోగా నటించిన శివాజీ సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాలో సుమన్ పోషించిన.. మెయిన్ విలన్ పాత్ర మోహన్ లాల్ నటించాల్సింది. కానీ ఒక కారణం వల్ల.. మోహన్ లాల్ ఈ సినిమాకి నో చెప్పల్సి వచ్చిందట.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 4, 2024, 10:00 PM IST
Mohanlal: రజినీకాంత్ తో నటించడానికి నో చెప్పిన హీరో.. అది కూడా శంకర్ సినిమాకి!

Mohanlal - Rajinikanth: మలయాళంలో ఉన్న స్టార్ హీరోలలో.. మోహన్ లాల్ పేరు ముందే ఉంటుంది. కేవలం మలయాళంలో మాత్రమే కాక.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద..మోహన్ లాల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా మోహన్ లాల్ జనతా గ్యారేజ్.. వంటి సినిమాలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. 

గత 40 ఏళ్ల నుంచి.. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న మోహన్ లాల్ 350 కి పైగా సినిమాల్లో.. నటించారు. హీరోగా మాత్రమే కాక.. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా కనిపించి మెప్పించారు. అయితే చాలా కాలం క్రితం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన శివాజీ: ది బాస్ సినిమాలో కూడా మోహన్ లాల్ విలన్ పాత్ర పోషించాల్సిందట. 

డైరెక్టర్ శంకర్ సినిమా స్క్రిప్ట్ కూడా వినిపించారట. మోహన్ లాల్ కి కూడా కథ బాగా నచ్చింది.. కానీ అప్పటికే తాను కమిట్మెంట్ ఇచ్చిన.. కొన్ని మలయాళం సినిమాలు ఉన్నాయట. మరోవైపు డైరెక్టర్ శంకర్ సినిమా కోసం.. ఏకంగా ఒక ఏడాది డేట్లు అడిగారట. అంత సమయం ఇవ్వాలి అంటే.. మోహన్ లాల్ ఆల్రెడీ ఒప్పుకున్న సినిమలు హోల్డ్ లో పెట్టేయాలి. ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను సంవత్సరం వెయిట్ చేయమని చెప్పలేం అని ఒకే ఒక్క కారణంతో.. మోహన్ లాల్ ఈ సినిమాకి నో చెప్పారట. 

అలా మోహన్ లాల్ రజనీకాంత్ కలిసి నటించాల్సిన సినిమా కుదరలేదు. అయితే కథ విన్నప్పుడే తనకి నచ్చిందని.. కానీ డేట్ల వల్ల మాత్రమే సినిమా చేయలేకపోయాను అని క్లారిటీ ఇచ్చారు.. మోహన్ లాల్. ఏదేమైనా మోహన్ లాల్ రజనీకాంత్ లని ఒకేసారి వెండి తెర.. మీద చూసే అవకాశం పోయినందుకు అభిమానులు కూడా హర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. 

మోహన్ లాల్ నో చెప్పాక ఆ పాత్ర సుమన్ కి దక్కింది. 2007లో విడుదలైన సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతానికి మోహన్ లాల్.. పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న లూసిఫర్ 2 సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నారు.

Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?

Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News