Ponniyin Selvan 2 Collection : పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ డే కలెక్షన్లు.. టార్గెట్ తక్కువే.. కలెక్షన్లూ తక్కువే

Ponniyin Selvan 2 Day 1 Collection పొన్నియిన్ సెల్వన్ సినిమాను కోలీవుడ్ అంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో ఫ్లాప్‌గా నిలిచింది. కేవలం తమిళ భాషలోనే హిట్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్‌కి సైతం అలాంటి టాకే వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 06:19 PM IST
  • నెట్టింట్లో పొన్నియిన్ సెల్వన్ 2 సందడి
  • టాలీవుడ్‌లో పార్ట్‌ 2కి దక్కని ఆదరణ
  • పని చేయని మణిరత్నం మ్యాజిక్
Ponniyin Selvan 2 Collection : పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ డే కలెక్షన్లు.. టార్గెట్ తక్కువే.. కలెక్షన్లూ తక్కువే

Ponniyin Selvan 2 Day 1 Collection పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చింది. తమిళంలో అయితే ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కొందరైతే ఏకంగా ఐదు స్టార్లు ఇచ్చేశారు. మాస్టర్ పీస్ అంటూ మణిరత్నంను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే తెలుగులో ఈ సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. ఫస్ట్ పార్ట్‌కు ఎలాంటి రివ్యూలు వచ్చాయో.. ఇప్పుడు కూడా అలాంటి రివ్యూలే వచ్చాయి. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉన్నా కూడా కథ, కథనాలు మన తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కవనే అంటున్నారు.

అయితే ఈ సినిమా మొదటి పార్ట్ విషయంలో భారీ నష్టాలు తలెత్తాయి. దీంతో రెండో పార్ట్‌ను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు అంత ఈజీగా ముందుకు రాలేదు. చివరకు ఎలాగోలా బయ్యర్లు దొరికారు. చాలా తక్కువ టార్గెట్‌తో ఈ సెకండ్ పార్ట్ బరిలోకి దిగింది. రెండో పార్ట్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పది కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్టు లెక్క. మరి ఈ పది కోట్ల షేర్ రాబడుతుందా? లేదా? అన్నది అనుమానంగానే మారింది.

మొదటి రోజు పొన్నియిన్ సెల్వన్‌ 2కి తెలుగులో అంతగా ఆదరణ దక్కలేదు. తమిళంలో కూడా ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లేమీ సొంతం చేసుకుంది. తునివు, వారిసుల కంటే తక్కువే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో మూడో ప్లేస్‌లోనే ఉంది. అదే తెలుగులో అయితే ఈ సినిమా మరీ దారుణమైన కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.

Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

పొన్నియిన్ సెల్వన్ 2కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం మూడు కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు 2.8 కోట్ల గ్రాస్.. 1.4 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇది చాలా పూర్ ఓపెనింగ్స్ అని అర్థం అవుతోంది. ఈ లెక్కనే కలెక్షన్లు ఉంటే.. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను టచ్ చేసేట్టుగా కనిపించడం లేదు.

Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News