Pragya-Salman: సల్మాన్ సినిమాలో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్టే వచ్చి...చివరకు..!

Pragya Jaiswal: హీరోయిన్​ ప్రగ్యాజైశ్వాల్​కు సల్మాన్ తో నటించే ఛాన్స్ మిస్సైందట! సల్మాన్ 'అంతిమ్​: ది ఫైనల్​ ట్రూత్​'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారినట్లు తెలుస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 04:29 PM IST
Pragya-Salman: సల్మాన్ సినిమాలో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్టే వచ్చి...చివరకు..!

pragya jaiswal-salman khan: కంచె సినిమా తర్వాత అంతటి విజయం దక్కించుకోలేకపోయింది నటి ప్రగ్యాజైశ్వాల్(pragya jaiswal). ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్యతో 'అఖండ' సినిమా(Akhanda Movie)లో సందడి చేసింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల మందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో పుల్ బిజీగా గడుపుతోంది ప్రగ్యా. అయితే ఈమె గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్(Viral) అవుతోంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌(Salman Khan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌'(salmankhan antim movie). మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించారు. సల్మాన్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఆయనపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించాలని మొదట చిత్రయూనిట్ భావించిదట. ఆ పాటలో సల్మాన్‌ సరసన డ్యాన్స్‌ చేయడానికి నటి ప్రగ్యాజైశ్వాల్‌ను టీమ్‌ సంప్రదించగా.. ఆమె ఓకే కూడా అన్నారట. తీరా సినిమా షూట్‌ మెుదలయ్యాక..సీరియస్‌ కంటెంట్‌లో రొమాంటిక్ సాంగ్‌ ఉండకపోతేనే బాగుంటుందని టీమ్‌ నిర్ణయించుకొని ప్రగ్యాను తప్పించునట్లు తెలుస్తోంది.

Also Read: Acharya OTT Rights: ‘ఆచార్య’ సినిమా కోసం పోటీపడుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రగ్యా టీమ్‌కు 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు.. ఈ ఆఫర్‌ ప్రగ్యా చేతికి వచ్చి ఉంటే బాలీవుడ్‌(Bollywood)లోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చి ఉండేదని నెటిజన్లు అనుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News