RC16: తారక్ రిజెక్ట్ చేసిన కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్.. ఆ మూవీ వెనుక పెద్ద కథే ఉందే..!

Peddi: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలి అనుకున్న సినిమా మరొక హీరో చేయడం సర్వసాధారణం. కామన్ అయినా ఈ విషయం గురించి ప్రస్తుతం తారక్ ,చెర్రీ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2024, 07:55 PM IST
RC16: తారక్ రిజెక్ట్ చేసిన కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్.. ఆ మూవీ వెనుక పెద్ద కథే ఉందే..!

Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అయితే ఈ మూవీ వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న అతను నుంచి మరొక మూవీ రాలేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.  రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి కూడా అప్డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో తారక్, రామ్ చరణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ మరొక మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ కూడా అనుకున్నారు. కాగా ఈ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కు భారీ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నిజానికి ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ కోసం రెడీ చేశారని.. అయితే డేట్స్ కుదరకపోవడంతో తారక్ నువ్వు చెప్పారని టాక్. మాంచి స్కోప్ ఉన్న మూవీ కావడంతో తారక్ ఈ స్టోరీ ను తన ఫ్రెండ్ చరణ్ దగ్గరకు పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంతమంది అన్న విషయం ఒక బుచ్చిబాబుకు మాత్రమే తెలుసు.

అయితే దీని గురించి సోషల్ మీడియాలో ఫాన్స్ మాత్రం పెద్ద డిస్కషన్స్ పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో వదిలేసిన కథ మీ హీరో చేస్తున్నారు అంటే.. రామ్ చరణ్ అభిమానులు మీకు అంత సీన్ లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

హీరోలు ఫ్రెండ్షిప్ చేస్తూ బాగానే ఉంటారు. మధ్యలో వారి అభిమానులు మాత్రం వాదోపవాదాలకు దిగుతున్నారు. ఈ మూవీ కి సంబంధించి చెర్రీ.. తారక్ అభిమానుల మధ్య హాట్ డిస్కషన్ జరుగుతోంది. అయితే ఇక్కడ అందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. అందరూ అనుకున్నట్లుగా పెద్ది మూవీ నిజంగానే తారక్.. చెర్రీ కోసం పంపినా.. అందులో కొత్తమీ లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక హీరో వద్దు అనుకున్న సినిమాని మరొక హీరో చేసి బ్లాక్ బస్టర్ సాధించారు.

మహేష్ బాబు రికార్డ్ సృష్టించిన అతడు చిత్రం పవన్ కళ్యాణ్ చేయాల్సింది.. సుమంత్ నువ్వే కావాలి మూవీ ని వదులుకున్నాడు.. ఇలా మనం ఉండే టాలీవుడ్ లో బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. రామ్ చరణ్ మూవీ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే స్టోరీ అని చెప్పిన వీడియో క్లిప్ ని చెర్రీ ఫ్యాన్స్ వెతికి.. బాగా వైరల్ చేశారు. రామ్ చరణ్ కు ,జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య బాండింగ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇద్దరూ అగ్ర హీరోలు అయినా కలిసి సినిమా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య కథలు ఎవరి నుంచి ఎవరికీ వెళ్ళినా పెద్ద పట్టింపులు ఉండవు. కాబట్టి ఫ్యాన్స్ కూడా దీని గురించి పెద్దగా హడావిడి చేయాల్సిన అవసరం లేదు.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News