Happy Birthday Nani: అసిస్టెంట్ డైరెక్టర్ టు నేచురల్ స్టార్.. నాని ప్రస్థానం తెలుసా?

Happy Birthday Hero Nani: ఈరోజు హీరో నాని పుట్టినరోజు, ఈ సందర్భంగా ఆయన కెరీర్ ఎలా మొదలైంది, ఒక క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని ఈరోజు హీరోగా ఎలా మారాడు అనే విషయాల మీద ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 12:28 PM IST
Happy Birthday Nani: అసిస్టెంట్ డైరెక్టర్ టు నేచురల్ స్టార్.. నాని ప్రస్థానం తెలుసా?

Hero Nani Background: ఈరోజు హీరో నాని పుట్టినరోజు, ఈ సందర్భంగా ఆయన కెరీర్ ఎలా మొదలైంది, ఒక క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని ఈరోజు హీరోగా ఎలా స్థిరపడ్డారు? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాని ఈరోజు ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయి ఉండవచ్చు కానీ ఒకప్పుడు నాని ఫిలిం కెరీర్ ప్రారంభించింది మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక క్లాప్ అసిస్టెంట్ గా. లెజెండరీ డైరెక్టర్ బాపు వద్ద ఆయన క్లాప్ అసిస్టెంట్ గా కొన్నాళ్లపాటు పనిచేశారు.

రాధాగోపాలం సినిమాకి గాను నాని క్లాప్ అసిస్టెంట్గా పనిచేశారు. శ్రీకాంత్ స్నేహ ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన ఈ సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్గా వ్యవహరించగా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి కొన్ని సినిమాలకు పని చేశారు. అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మా సినిమాతో నాని హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత ఆయన రెండు సినిమాలు చేశాడు కానీ ఆ రెండు సినిమాలు కలిసి రాలేదు. రైడ్, స్నేహితుడు అనే సినిమాలు కథాపరంగా బాగానే ఉంటాయి కానీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.

తర్వాత భీమిలి కబడ్డీ జట్టు సినిమా కూడా మంచి మూవీ అనిపించింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నాని చేసిన అలా మొదలైంది సినిమా మంచి హిట్ అయింది. ఇక తరువాత తమిళంలో నాని చేసిన వెప్పం సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది గాని కమర్షియల్ గా వర్క్ ఔట్ అవ్వ లేదు. తర్వాత పిల్ల జమిందార్, ఈగ వంటి సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, దొంగాట, భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మెన్, జో అచ్చుతానంద, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, కృష్ణార్జున యుద్ధం, నీవెవరో, దేవదాసు, జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యాం సింగారాయ్, అంటే సుందరానికి వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించిన ఆయన మూడో భాగంలో తానే ప్రధాన హీరో అనే హింట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి నాని హీరోగా దసరా అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో ఆయన మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నాని హీరోగా 30వ సినిమా రూపొందనుంది. శౌర్యవ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఆ సినిమా తెరకెక్కనుంది. ఇక ఆ సినిమా పూర్తి అయిన తర్వాత నాని హిట్ 3 సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాని ఒక ఏసీపీగా కనిపించబోతూ ఉండగా హిట్ ఒకటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ మూడో భాగానికి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. నాని నిర్మాణంలోనే ఈ సినిమా కూడా నిర్మించబడే అవకాశం కనిపిస్తోంది.

Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?

Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News