Salman Khan - AR Murugadoss: మహేష్ బాబు దర్శకుడితో సల్మాన్ నెక్ట్స్ మూవీ.. అఫీషియల్ ప్రకటన..

Salman Khan - AR Murugadoss: సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. భారత్ మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో హిట్టు కోసం ఇపుడు దక్షిణాది టాప్ దర్శకుడైన ఏ.ఆర్.మురుగదాస్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2024, 12:10 PM IST
Salman Khan - AR Murugadoss: మహేష్ బాబు దర్శకుడితో సల్మాన్ నెక్ట్స్ మూవీ.. అఫీషియల్ ప్రకటన..

Salman Khan - AR Murugadoss: సల్మాన్ ఖాన్‌కు వెంటనే ఓ బడా సక్సెస్ రావాలి. తన తోటి హీరో అయిన షారుఖ్ ఖాన్.. వరుసగా పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా వెయ్యి కోట్ల సినిమాలు చేసి బాలీవుడ్ టాప్ చైర్‌లో కూర్చున్నాడు. కానీ సల్మాన్ ఖాన్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయడం లేదు. లాస్ట్ ఇయర్ సల్మాన్  ఖాన్ హీరోగా నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాతో పాటు 'టైగర్ 3' మూవీలో పెద్దగా ఆడలేదు. టైగర్ 3 మూవీ మాత్రమే రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. టైగర్ 3 మూవీ తర్వాత ఏ సినిమా సైన్ చేయని సల్మాన్ ఖాన్.. సరైన కథ కోసం వెతుకుతున్నాడు. ఈ కోవలో తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయి వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించారు. 

ఏ.ఆర్.మురుగదాస్ హిందీలో ఆమీర్ ఖాన్‌తో గజినీ, అక్షయ్ కుమార్‌తో 'హాలీడే' వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయా హీరోలకు మెమరబుల్ హిట్స్ అందించాయి. ఇక చివరగా హిందీ సోనాక్షి సిన్హాతో 'అకిరా' మూవీతో పలకరించారు. ఇది మాత్రం పెద్దగా ఆడలేదు. పైగా మురుగదాస్ సినిమాలు హిందీ, తమిళంలో మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌తో ఓ కమర్షియల్ కమ్ మంచి మెసెజ్ ఉన్న సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటులు .. ఇతర టెక్నిషియన్స్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా.. అటు హీరోగా సల్మాన్ ఖాన్‌తో పాటు దర్శకుడిగా మురుగదాస్‌కు వెంటనే హిట్ కావాలి. ఒక రకంగా సల్మాన్ ఖాన్‌తో మురుగదాస్ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి కంపల్సరీ. అటు సల్మాన్ ఖాన్‌కు మురుగదాస్ హిట్ ఇచ్చి హీరోగా ఫామ్‌లోకి తీసుకొస్తాడా లేదా అనేది చూడాలి. 
Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News