Salman Khan Dance : నవ్వులపాలవుతున్న సల్మాన్.. ఆ డ్యాన్స్‌లకు దండం పెట్టేస్తోన్న నెటిజన్లు

Kisi Ka Bhai Kisi Ki Jaan Dance Trolls సల్మాన్ ఖాన్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌ జరుగుతోంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ నుంచి విడుదల అవుతున్న పాటలు, అందులో సల్మాన్ వేస్తోన్న స్టెప్పులు చూస్తుంటే నవ్వొస్తోందని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 06:09 PM IST
  • నెట్టింట్లో సల్మాన్ ఖాన్ సందడి
  • సల్మాన్ స్టెప్పులపై ట్రోల్స్
  • కిసి కా భాయ్ కిసి కా జాన్ వీడియోలు
Salman Khan Dance : నవ్వులపాలవుతున్న సల్మాన్.. ఆ డ్యాన్స్‌లకు దండం పెట్టేస్తోన్న నెటిజన్లు

Salman Khan Dance Trolls సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇలా ఎంత పెద్ద తురుమ్ ఖాన్ అయినా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావాల్సిందే. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు. ఇక ఆయన పర్సనల్ విషయాలు, విడాకులు, ఫ్యామిలీ ఫోటోల మీద దారుణమైన నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. షారుఖ్ ఖాన్ మీద ఇది వరకు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. పఠాన్ సినిమా అంతో ఇంతో షారుఖ్‌ని నిలబెట్టేసింది.

సల్మాన్ ఖాన్ తాజాగా నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. మామూలుగా ఆ మధ్య సల్మాన్ ఖాన్ స్టెప్పులు వైరల్ అయ్యాయి. కాళ్ల నొప్పులు ఉన్నట్టుగా.. కొత్త ప్యాంట్ కొంటే టెస్ట్ చేసినట్టుగా ఆ స్టెప్పులు ఏంటి? సల్మాన్‌ను ట్రోల్ చేశారు. మొన్న సల్మాన్, వెంకీ, రామ్ చరణ్‌ కలిసి వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. లుంగీకి, ధోతికి తేడా లేకుండా చేశారంటూ ట్రోల్స్ వేశారు.

 

ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ తాజాగా నెగెటివ్ కామెంట్లకు గురవుతున్నాడు. సల్మాన్ వేసిన వింత స్టెప్పులు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ వేసే మూమెంట్స్ ఎప్పుడూ కామెడీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతగా డ్యాన్స్ రాని సల్మాన్‌ ఏదో కష్టపడి తనకు వచ్చిన స్టెప్పులనే తిప్పి తిప్పి వేస్తాడు. ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోనూ అవే స్టెప్పులు వేశాడు.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఈ సినిమాను తమిళంలో వచ్చిన వీరమ్‌కు రీమేక్ అని అంటున్నారు. ఇదే సినిమాను తెలుగులో కాటమరాయుడు అని పవన్ కళ్యాణ్‌ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరి సల్మాన్ తీసిన ఈ చిత్రం ఆ సినిమాకు రీమేకా? కాదా? అన్నది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News