Rolls Royce Cullinan Black Badge: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సినిమాకు వచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే షారుక్ ఖాన్‌కి ఖరీదైన కార్లు అంటే ఎంతో క్రేజ్ అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే షారుఖ్ ఖాన్ వద్ద ఆడి, బిఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్ వంటి బ్రాండ్స్‌కి చెందిన కార్లు ఎన్నో ఉన్నాయి. IANS వెల్లడించిన వివరాల ప్రకారం, షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న ఖరీదైన కార్ల జాబితాలోకి తాజాగా మరో కారు కూడా వచ్చి చేరింది. ఆ కారు మరేదో కాదు.. రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ SUV కారు. కస్టమైజ్డ్ ఫీచర్స్ అన్నీ కలిపి ఆన్ రోడ్ వచ్చేసరికి ఈ కారు ఖరీదు రూ. 10 కోట్లకు పై మాటే ఉంటుంది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కొత్త కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ నివసించే మన్నత్‌లోకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ప్రవేశించిన వీడియో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ వారియర్స్ ఫ్యాన్ క్లబ్ పేరిట ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో పోస్ట్ అయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌పై ఉన్న నెంబర్లో చివరి నాలుగు అంకెలైన 0555 చూస్తే అది నిజంగానే కింగ్ ఖాన్ సొంత కారేననే విషయం అర్థమైపోతుంది.
#Pathaan's new Rolls-Royce Cullinan Black Badge ❤️🔥#ShahRukhKhanpic.twitter.com/SG8ACQCPL5
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) March 26, 2023
షారుఖ్ ఖాన్ వద్ద రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ SUV కారు మాత్రమే కాదు.. ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, ఎలక్ట్రిక్ BMW i8 వంటి కార్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. హ్యుందాయ్ శాంట్రో, క్రెటాతో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్, మిత్సుబిషి పజెరో, BMW 6-సిరీస్ కన్వర్టిబుల్ వంటి కార్లు కూడా షారుఖ్ కార్ల జాబితాలో ఉన్నాయి. అన్నట్టు గతంలో.. అంటే దాదాపు 15 ఏళ్ల కిందటే షారుఖ్ ఖాన్ హ్యూందాయ్ కార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది.
బాలీవుడ్లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జోనస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ వంటి అతికొద్దిమంది సెలబ్రిటీల వద్దే రోల్స్ రాయిస్ కారు ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. షారుఖ్ ఖాన్ వద్ద రూ. 7-కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కూపే కూడా ఉంది. ఇది 6.8-లీటర్ V 12 ఇంజన్‌తో రన్ అవుతుంది అని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.
Actor Shah Rukh Khan new car ROLLS ROYCE CULLINAN #ShahRukhKhan #srk #Pathaan #jawan pic.twitter.com/CLPvQU1PGP
— jit g (@contistang) March 27, 2023
షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకుపైనే వసూలు చేసింది. జీరో మూవీ తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఆడియెన్స్ ముందుకు వచ్చిన షారుఖ్ సత్తాను చాటింది. షారుఖ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నాడు. జవాన్ మూవీలో నయన తార ఫీమేల్ లీడ్ పోషిస్తుండగా.. విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 మూవీలోనూ షారుఖ్ ఖాన్ ఒక అతిధి పాత్రలో కనిపించనున్నాడు. టైగర్ 3 మూవీ ఈ ఏడాది నవంబర్ 10న రిలీజ్ కానుంది.
ఇది కూడా చదవండి : Golden Treasure in Fort: పాకిస్థాన్ ప్రధాని కన్నేసిన జైఘడ్ కోట.. కోట నిండా 60 ట్రక్కుల రహస్య నిధి
ఇది కూడా చదవండి : MM Keeravani Bed rest: ఆస్కార్ అందుకుని ఇండియా వచ్చిన కీరవాణికి బెడ్ రెస్ట్.. ఏమైందంటే?
ఇది కూడా చదవండి : Dasara Movie First Review: రచ్చ రేపిన నాని.. పుష్ప 2.0గా దసరా.. రేటింగ్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK