Sundeep Kishan: సందీప్ కిషన్‌ పెళ్లి ఫిక్స్ అయిందా ? అమ్మాయి ఎవరు ?

సందీప్ కిషన్ పెళ్లి ( Sundeep Kishan wedding ) చేసుకోబోతున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన చేసిన ట్విటర్ పోస్టే. అవును.. సందీప్ కిషన్ తన అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా సందీప్ కిషన్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు

Last Updated : Aug 15, 2020, 10:06 AM IST
Sundeep Kishan: సందీప్ కిషన్‌ పెళ్లి ఫిక్స్ అయిందా ? అమ్మాయి ఎవరు ?

సందీప్ కిషన్ పెళ్లి ( Sundeep Kishan wedding ) చేసుకోబోతున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన చేసిన ట్విటర్ పోస్టే. అవును.. సందీప్ కిషన్ తన అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా సందీప్ కిషన్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. 2020 సంవత్సరం తన జీవితం గురించి చాలా విషయాలు గుర్తుచేసుకునేలా చేసిందనీ, అలాగే తనకు సంతోషాన్నిచ్చే విషయాల గురించి ఆలోచిస్తున్నానని సందీష్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. 2020 తన జీవితంలో పెద్ద అడుగు వేయడానికి సమయాన్నీ, ధైర్యాన్ని ఇచ్చిందనీ, బహుశా తన జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన విషయం ఇదేనని సందీప్ కిషన్ ( Sundeep Kishan ) అభిప్రాయపడ్డాడు. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పడానికి వెయిట్ చేయలేక పోతున్నానని, కానీ అదేంటో తెలుసుకోవాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే అని సందీప్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అలాగే ‘మ్యాన్ ఇన్ లవ్’ స్టిక్కర్‌ను కూడా ట్వీట్ చేశాడు. Also read : Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం

సందీప్ కిషన్ చేసిన ట్వీట్ చూస్తోంటే ఈ లాక్ డౌన్ సమయంలో ఈ యువ హీరో తన జీవిత భాగస్వామిని ఎంచుకునే పనిలో పడ్డాడా అని కొందరు.. త్వరలో సందీప్ వివాహం చేసుకోబోతున్నాడా అని ఇంకొందరు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. సోమవారం సందీప్ కిషన్ చేయబోయే ప్రకటన తన పెళ్లి గురించే అయ్యుంటుందని అభిమానులు ఆ ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ కిషన్ ఇవ్వబోయే ఆ బిగ్ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే మరి. Also read : SP Balu: నాకేం కాదు.. ఐసీయూలో ఎస్పీ బాలు థంబ్స్ అప్ ఫోటో వైరల్

అన్నట్టు రానా దగ్గుబాటి, నితిన్, నిఖిల్ వంటి హీరోలు కూడా ఈ లాక్ డౌన్ సమయంలోనే పెళ్లిళ్లు చేసుకుని ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అదే దారిలో సందీప్ కిషన్ కూడా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నాడా అనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. Also read : Niharika engagement: నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి పవన్ కల్యాణ్ అందుకే రాలేదట

Trending News