Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు.. ఎమోషనల్ అయిన నితిన్

AP Elections 2024: జనసేన గెలుపు పై టాలీవుడ్ సెలబ్రిటీ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కొంతమంది నటినటులు.. పవన్ కళ్యాణ్ కి తమదైన స్టైల్ లో ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 4, 2024, 03:31 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు.. ఎమోషనల్ అయిన నితిన్

 Tollywood celebrities tweets on Pawan Kalyan: టిడిపితో కలిసి కూటమి ఏర్పరిచిన జనసేన.. ప్రస్తుతం తమ ఘనవిజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి వైసీపీని ఓరించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా.. అన్ని స్థానాల్లో కూడా మెజారిటీ కనబరచడం హైలెట్ గా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైసీపీ కంటే ఎక్కువ స్థానాల్లో జన సేన జెండాను ఎగురవేసేలా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో రికార్డులు కొట్టబోతోన్నాడు. ఈ నేపథ్యంలో అప్పుడే పవర్ స్టార్ అభిమానులు, తోటి హీరోలు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వరుస ట్వీట్లతో హంగామా చేస్తోంది. ఓజీ పోస్టర్ సైతం విడుదల చేసి పవన్ అభిమానులను ఖుషీ చేసింది. మరో పక్క సాయి ధరం తేజ్, నితిన్ లాంటి హీరోలు ఎమోషనల్ అయి మరి ట్వీట్స్ పెట్టారు.

ముఖ్యంగా నిర్మాత డివివి దానయ్య..ఎవ్వరికీ అందదు అతని రేంజ్.. డెత్ కోటా కన్ఫామ్ అంటా.. హంగ్రీ చీతా అంటూ వరుస ట్వీట్లతో పవన్ అభిమానులను హోరెత్తిస్తున్నాడు. ఇక మరోపక్క సాయి ధరమ్ తేజ్ సైతం తన మామ గెలుపు మీద వరుస ట్వీట్లు వేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సేఫ్ హాండ్స్ లో పడింది అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా జగన్‌ని పాతాళానికి తొక్కేస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని, ఆ వీడియోని కూడా షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ‘చెప్పాడు.. చేశాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ తన మామ మీద తనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

 

మరో పక్క పవన్ కళ్యాణ్ కి వీరాభిమానైనా టాలీవుడ్ హీరో నితిన్ కూడా తనదైన స్టైల్ లో ట్రీట్ చేశారు. ‘ఓ అభిమానిగా, ఓ సోదరుడిగా.. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. ఎన్నికల్లో మీరు చరిత్రను సృష్టించారు.. మీ సత్తాతో కూటమిని నిలబెట్టారు.. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.. ఈ విజయానికి మీరు అర్హులు.. మీరెప్పటికీ మా పవర్ స్టార్’ అంటూ ట్వీట్ వేశాడు నితిన్.

 

 

Read more; Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News