కోట్లు కొల్లగొడుతున్న మహర్షి ; ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ !

భారీ అంచానాలతో తెరపైకి ఎక్కిన మహర్షి మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీజు వద్ద సక్సెఫుల్ గా రాణిస్తోంది

Last Updated : May 10, 2019, 04:14 PM IST
కోట్లు కొల్లగొడుతున్న మహర్షి ; ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ !

ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహిర్షికి విశేషమైన స్పందన లభించింది. సూపర్ స్టార్ మహేశ్‌ నటన తో పాటు కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర బృందాన్ని  నెటిజన్లు ప్రశంసించారు. కాగా ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం కావడంతో '' మహర్షి''  భారీ అంచనాతో తెరపైకి ఎక్కిక విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది.  ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ.24.6 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు అంచనా వేశారు. 

ప్రాంతాల వారీగా కలెక్షన్లు:

* నైజాంలో రూ.6.38 కోట్లు
* తూ.గో జిల్లాలో రూ.3.2 కోట్లు
* ప. గో జిల్లాలో రూ.2.47 కోట్లు
* కృష్ణలో రూ.1.39 కోట్లు
* గుంటూరులో రూ.4.4 కోట్లు
* నెల్లూరులో రూ.1 కోటి 
* యూఏలో రూ2.88 కోట్లు
* సీడెడ్‌లో  రూ.2.89 కోట్లు

ఇదే స్పేడ్ కొనసాగితే...

రెండో రోజు కూడా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మహిర్షి ఇదే జోరు కొనసాగితే వందకోట్ల క్లబ్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా పదిలమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశముందంటున్నారు.

Trending News