Saranga Dariya Trailer: బీ అలర్ట్.. ఆల్ ద బెస్ట్.. రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ చూశారా..!

Saranga Dariya Release Date: సారంగదరియా మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు రాజా రవీంద్ర. జూలై 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైలాగ్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా పండించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 5, 2024, 12:02 PM IST
Saranga Dariya Trailer: బీ అలర్ట్.. ఆల్ ద బెస్ట్.. రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ చూశారా..!

Saranga Dariya Release Date: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌, మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూలై 12న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుండగా.. రిలీజ్ చేసిన టీజర్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే సాంగ్స్ నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ లాంచ్ చేశారు. సారంగదరియా సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

Also Read: Samantha: సమంత పై ఫైర్ అయిన డాక్టర్.. సామ్ కి మద్దతు పలికిన హీరో.. స్పందించిన నటి

ట్రైలర్‌లో డైలాగ్స్‌తో మేకర్స్ ఆకట్టుకున్నారు. ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. బీ అలర్ట్.. ఆల్ ద బెస్ట్ అని రాజా రవీంద్ర చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు మిడిల్ క్లాస్ కష్టాలను కళ్లకు కట్టినట్ల తెరకెక్కించినట్ల అర్థమవుతోంది. ముఖ్యంగా రాజా రవీంద్ర నటన ఆడియన్స్‌ మనసును కదిలేంచేలా ఉంది. మధ్య తరగతి తండ్రిగా.. గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపించినట్లు నటనతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. జూలై 12న సారంగదరియా సినిమా థియేటర్లలో చూసి మంచి విజయాన్ని అందించాలని మేకర్స్ కోరుతున్నారు. 

సాంకేతిక వర్గం:

==> బ్యానర్- సాయిజా క్రియేషన్స్
==> నిర్మాతలు - ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి
==> దర్శకత్వం - పద్మారావు అబ్బిశెట్టి (పండు)
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్
==> మాటలు - వినయ్ కొట్టి
==> ఎడిటర్ - రాకేష్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్ - ఎం.ఎబెనెజర్ పాల్
==> సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు
==> పాటలు - రాంబాబు గోశాల, కడలి స‌త్య‌నారాయ‌ణ‌ 
==> అడిషనల్ రైటర్ - రఘు రామ్ తేజ్.కె, 
==> PRO- కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News