''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'' గురించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు !!

వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం గురించిన లేటెస్ట్ అప్ డేట్ ను అభిమానులకు అందించారు.   

Last Updated : Aug 8, 2019, 01:39 PM IST
''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'' గురించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు !!

రాంగోపాల్ వర్శ డైరక్షన్ లో తెరపైకి ఎక్కుతున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీ టైటిల్  వింటేనే ఇది కల్చితంగా వివాదాస్ప మూవీ అని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ లక్ష్మీస్ తరహా  మరో వివాదంలోకి వెళ్లబోతున్నారని అందరూ భావిస్తున్న తరుణంలో ...ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ ఊహించినట్లుగా ఇది  కాంట్రవర్శియల్ మూవీ కాదని... ఇది అంత్యంత వివాదరహిత మూవీ అంటూ వర్శ చమత్కరించారు.

వర్మ ఫార్ములా ఇదే...

మూవీ టైటిల్ కు వర్మ మాటలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది కదూ.. అసలు ఈ మూవీలో ఎలాంటి మేటర్  ఆసక్తి  కలుగుతోంది కదూ.. ఇదే వర్శ స్టయిల్. మూవీ రిలీజ్ కు ముందు ఆడియన్స్ ను అటెన్షన్ లో పడేయడం వర్మ వెన్నతో పెట్టిన విద్య. ఇదే  వర్శ ఫార్ములా కూడా..మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్శ  ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ట్రయిలర్ సాంగ్ రిలీజ్

ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' గురించిన లేటెస్ట్ అప్ డేట్ ను అభిమానులకు అందించాడు.  రేపు తొలి సాంగ్ ట్రయిలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  కాగా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న వర్మ దీనికి సంబంధించిన వివరాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. 

 

సోషల్ మీడియాలో వైరల్..

వర్మ  చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా ట్వీట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది.   ఒకరైతే వర్శ ట్వీట్ కు స్పందిస్తూ సినిమాలు తీయడం మానేసి వైన్ షాపు పెట్టుకుంటే ఫుల్ గా సేల్ ఉంటుందని కామంట్ చేశారు... ఇంకొరైతే ఎందుకు సర్ గొడవలు అంటే మీకు ఇష్టం అంటున్నారు.. మరోకరు ఓ సామి నీ పిచ్చి కి నేను ఫిదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా వర్మ ట్వీట్ కు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు

Trending News