Viral Video: ప్రాణాలు రిస్క్ చేసి మరీ ఆవును కాపాడిన వ్యక్తి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Latest Viral Videos: తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఆవును కాపాడిన ఓ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 5, 2022, 05:42 PM IST
Viral Video: ప్రాణాలు రిస్క్ చేసి మరీ ఆవును కాపాడిన వ్యక్తి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Latest Viral Videos: ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లపై, వీధుల్లో నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వర్షపు నీరు కారణంగా మ్యాన్ హోల్స్‌లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే, తడిచిన ఎలక్ట్రిక్ స్తంభాలను తాకితే విద్యుత్ షాక్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మనుషులంటే ఎలాగోలా జాగ్రత్తగా వెళ్లగలరు. కానీ మూగజీవాలు కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల్లో  చిక్కుకుంటాయి. తాజాగా పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

భారీ వర్షం కారణంగా మాన్సాలోని ఓ ప్రదేశంలో రోడ్డుపైకి భారీ వరద నీరు చేరింది. ఒకరకంగా ఆ ప్రదేశం చెరువును తలపిస్తోంది. ఆ నీళ్లలో నుంచి నడిచి వెళ్లిన ఓ ఆవు.. ఎలక్ట్రిక్ పోల్ సమీపంలోకి వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే నీటిలో కుప్పకూలింది. సమీపంలోని దుకాణదారుడు ఒకరు ఆ ఆవును గమనించి వెంటనే దాని వద్దకు పరిగెత్తుకెళ్లాడు.

తడి గుడ్డను దాని కాళ్లకు చుట్టి.. దానితో ఆవును ఎలక్ట్రిక్ పోల్ నుంచి దూరంగా లాక్కొచ్చాడు. అతనికి మరో ఇద్దరు కూడా సహకరించారు. దీంతో విద్యుత్ షాక్ నుంచి తేరుకున్న ఆ ఆవు..కాసేపటికి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి సకాలంలో స్పందించడంతో ఆవు ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఆవును కాపాడినందుకు అతన్ని అభినందిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే 1.2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. 

Also Read: Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ..  

Also Read: Shocking Video: రోడ్డెక్కిన డైనోసార్..తిండి పెట్టబోయిన వ్యక్తిని మింగబోయింది..వామ్మో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News