close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బాలయ్యకు నయన్ మళ్లీ ఆ ఛాన్స్ ఇస్తుందా ?

తెలుగు తెరపై సక్సెక్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న బాలయ్య, నయనతార జంట మళ్లీ జత కట్టడం ఇప్పట్లో సాధ్యపడేనా ?

Updated: May 4, 2019, 12:11 PM IST
బాలయ్యకు నయన్ మళ్లీ ఆ ఛాన్స్ ఇస్తుందా ?

బాలకృష్ణ హీరోగా మరో సరికొత్త మూవీ తెరపైకి వస్తున్నట్లు టాలీవడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య నెక్ట్ మూవీలో హీరోయిన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా డిసైడ్ చేయలేదట.. బాలయ్య, నయనతారా  సక్సెక్ ఫుల్ జోగీగా ముద్రపడిన నేపథ్యంలో మళ్లీ ఆమెనే సంప్రదించే అవకాశముందని సినీ విశ్లేషనకులు పేర్కొంటున్నారు

నయన్ బిజీ షెడ్యూల్...

 సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘దర్బార్’ సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీలో నయనతారకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఈ మూవీతో  పాటు వరసగా ఈ ఏడాదిలోనే మరో 4 సినిమాలకు ఆల్రెడీ సంతకం చేసిందట నయన్. ఈ బిజీ షెడ్యూల్స్ లో బాలయ్య సినిమాకోసం డేట్స్ సర్దడం అయ్యే పనేనా..? అనే ప్రశ్న రైజ్ అయింది..

నయన్ కు ఇది సామ్యమేనా ?

ఇప్పటి వరకు 4 సినిమాల్లో బాలయ్య సరసన హీరోయిన్ గా చేసింది నయనతార. ఆ సినిమాలలో బాలయ్యకి  ఎంత హైప్ వచ్చిందో నయనతార పర్ఫామెన్స్ కి కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఆ విషయం నయనతారకి కూడా తెలుసు కాబట్టి ‘నో’ అనడం కొంచెం కష్టమే. అయితే బాలయ్య ఆఫర్ వస్తే నయన్ ఎలా ఎడ్జస్ట్ చేసుకుంటుందనేది తేలాల్సి ఉంది.