Cancer Causes: కేన్సర్ ఇప్పటికీ ఓ ప్రాణాంతక వ్యాది. అసలు కేన్సర్ సోకడానికి కారణాలేంటి, జీన్స్ కాకుండా మరే ఇతర కారణాలున్నాయనే విషయంపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కేన్సర్ చికిత్సకు మెరుగైన ఔషధాల అణ్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేన్సర్ కేసులు పెరగడం వెనుక స్థూలకాయం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ప్రాణాంతక కేన్సర్ వ్యాధి అంటే అందరూ భయపడే పరిస్థితి. కేన్సర్ వ్యాధిపై నిరంతరం జరిగే పరిశోధనల్లో ఇటీవల ఓ కొత్త విషయం వెలుగుచూసింది. పెరుగుతున్న కేన్సర్ వ్యాదుల వెనుక స్థూలకాయం కారణమౌతోందనేది ఆ నిజం. స్వీడన్‌కు చెందిన లూండ్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో 40 శాతం కేన్సర్ రోగాలకు కారణం స్థూలకాయం అని తేలింది. ఈ అధ్యయనంలో 4 దశాబ్దాల వరకూ 4.1 మిలియన్ల మంది పాల్గొన్నారు. వీరందరి లైఫ్‌స్టైల్, బరువుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ తరువాత కేన్సర్ పరీక్షలు చేశారు. వీరందరిలో ఎవరైనా స్థూలకాయంతో ఉన్నారో వారిలో ఎక్కువమందిలో కేన్సర్ వ్యాధి కన్పించింది.
ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధకులు వివరించారు. స్థూలకాయం అనేది శరీరంలో స్వెల్లింగ్ సమస్యకు కారణమౌతుంది. ఇది సెల్స్ అసాధారణ రీతిలో విభజనకు ప్రేరేపిస్తుంది. దాంతో కేన్సర్ ముప్పు పెరుగుతుంది. దాంతోపాటు స్థూలకాయం కారణంగా ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇది కొన్ని రకాల కేన్సర్లను వృద్ధి చేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు బరువు నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బరువు నియంత్రణ అనేది చాలా రకాలుగా ఉంటుంది.
ముఖ్యంగా హెల్తీ డైట్ తీసుకోవడం. తీసుకునే డైట్ బ్యాలెన్స్‌గా ఉండాలి. ఇందులో పండ్లు , కూరగాయలు, తృణ ధాన్యాలు, లో ఫ్యాట్ ప్రోటీన్లు ఉండాలి. షుగర్ డ్రింక్స్, ఆయిలీ ఫ్రైడ్ పదార్ధాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఒత్తిడి కూడా స్థూలకాయానికి ప్రధాన కారణం. అందుకే నిరంతరం యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామం ద్వారా ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.
ఆధునిక జీవనశైలి ఉద్యోగాలతో శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఫలితంగా బరువు పెరిగిపోతున్నారు. రోజూ నిర్ణీత సమయం వ్యాయామం లేదా వాకింగ్ లేదా రన్నింగ్‌కు కేటాయించడం ద్వారా బరువు నియంత్రించుకోవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాల్సి ఉంటుంది. అంటే శారీరక శ్రమ ఉండాలి. మంచి నిద్ర కూడా ఓ కారణం. నిద్ర సరిగ్గా లేకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ప్రతిరోజూ 7-8 గంటలు తప్పకుండా నిద్ర ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Bones Health: ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్ తప్పకుండా తినండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook