Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: వేసవి కాలంలో అలసట, నీరసం రావడం సాధారణమే. అయితే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడే ఇలాంటి సమస్యలను ఎదురవుతాయనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం మన వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తుంటాం. అయితే వేసవిలో భూలోకంలో దొరికే అమృతం మజ్జిగ గురించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 25, 2024, 10:00 AM IST
Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: ఎండలు రోజురోజుకి మండిపోతున్నాయి. ప్రతిరోజూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు మరింత పెరిగిపోతుంది. ఈ క్రమంలో శరీరం త్వరగా డీహైడ్రేడ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. దీంతో శరీరంలో సత్తువ తగ్గి అలసట, నీరసం పెరిగిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం కూల్ డ్రింక్స్ లేదా ఇతర సహజ పానీయాలైన కొబ్బరి నీరు, బార్లీ వాటర్, చెరకు రసం, మజ్జిగ వంటి వాటిని పుచ్చుకుంటారు. ఇవి దాహార్తిని తీర్చడం సహా శరీరంలో తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే మజ్జిగ అనేది సామాన్యుడి దగ్గర నుంచి అందరికి దొరికే పానీయం. దేవతలను అమృతం ఎలాగో.. మనకి వేసవి కాలంలో మజ్జిగ అలాగ అనమాట. 

మజ్జిగలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వైద్యులు చెబుతుంటారు. మజ్జిగ ఎక్కువ పుచ్చుకునే వారు వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువని తెలుస్తుంది. అంతే కాకుండా విషదోషాలు, చర్మరోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన కొవ్వు, శరీరంలో అమిత వేడి తగ్గేందుకు మజ్జిగ ప్రయోజనకారిగా మారింది. 

మజ్జిగలో ఉపయోకరమైన బాక్టీరియా

పాలు సమీకృత ఆహారం అని అందరికీ తెలుసు. అయితే పాల ద్వారా వచ్చే పెరుగు, మజ్జిగలకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పాలలో ఉంటే పోషక విలువలన్నీ మజ్జిగలో పదిలంగా ఉంటాయనేది సత్యం. అంతే కాకుండా లక్టో బాసిల్లై అనే మంచి బ్యాక్టీరియా శరీరానికి మజ్జిగ ద్వారా లభిస్తుంది. అయితే శరీరానికి ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా పాలల్లో ఉండదు. 

సమ్మర్‌లో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1) ఎండల కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగలో విటమిన్ ఎ, బి, సి, ఇ, కె వంటివి ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. ఎండల వేడిమికి శరీరంపై ఎక్కువ చెమట విసర్జిస్తుంది. కాబట్టి వేసవిలో మజ్జిగ తరచుగా తీసుకోవడం వల్ల పోషకాల లోపాలన్నిటిని శరీరానికి చేరుస్తుంది. 

2) వేసవిలో అత్యధికంగా బాధించే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది.

3) రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా ఉత్తమం. మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.

4) సమ్మర్‌లో మజ్జిగ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. 

5) కడుపులో అజీర్తితో బాధపడేవారికి మజ్జిగ ఓ ఔషధంలా పనిచేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని ప్రేగుల పనితీరును మెరుగుపరచడం సహా ప్రోబయోటిక్స్ ను పుష్కలంగా అందిస్తుంది. దీంతో అజీర్తి సమస్యను నివారించినట్లు అవుతుంది. 

6) మజ్జిగ తరచుగా తాగడం వల్ల కడుపులో మంట లేదా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. 

7​) అసిడిటీ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే మజ్జిగ తీసుకోవడం ప్రయోజనకరం. దీని వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం వస్తుంది. 

8) ఫాస్ట్ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ తిని కడుపు అంతా ఉబ్బరంగా ఉన్న సమయంలో మజ్జిగ తీసుకోవడం మంచిది. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఫుడ్‌లోని మసాలా ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News