Oil Benefits For Hair: జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి, చుండ్రును తగ్గించడానికి నూనె ఎంతో సహాయపడుతుంది. తలకు నూనె రాసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలంలో తలకు నూనె రాసుకునే వారు చాలా తక్కువ. తలకు నూనె రాసుకోకుండా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బైక్‌కు పెట్రోల్ ఎలా అయితే సహాయపడుతుందో అలాగే తలకు నూనె ఎంతో అవసరం.
తలకు నూనె పెట్టుకోవడవం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:
తలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
జుట్టును బలపరుస్తుంది:
నూనెలు జుట్టుకు పోషణను అందిస్తాయి. దానిని బలంగా చేస్తాయి.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
నూనెలు జుట్టు కుదుళ్లను బలపరిచేందుకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి.
చుండ్రును తగ్గిస్తుంది:
చాలా నూనెలు యాంటీ-ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చుండ్రును కలిగించే శిలీంధ్రాలను చంపడానికి సహాయపడతాయి.
తలనొప్పిని తగ్గిస్తుంది:
తలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది:
నిద్రవేళకు ముందు తలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల మంచి నిద్ర పోవడానికి సహాయపడుతుంది.
మీ జుట్టు రకానికి సరిపోయే నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
తెల్లజుట్టు ఉన్నవారికి: కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనె
చుండ్రు ఉన్నవారికి: టీ ట్రీ ఆయిల్, నిమ్మరసం, కలబంద
జుట్టు రాలడం ఉన్నవారికి: ఉసిరి నూనె, బ్రాహ్మీ నూనె, కరివేపాకు నూనె
నూనె రాసే విధానం:
మీ జుట్టును శుభ్రంగా కడగండి.
కొద్దిగా నూనె వేడి చేయండి.
మీ వేళ్లతో నూనెను మీ తలకు, జుట్టుకు అప్లై చేయండి.
మీ తలకు మసాజ్ చేయండి.
30 నిమిషాల నుంచి ఒక రాత్రంతా నూనెను మీ జుట్టులో ఉంచండి.
మీ జుట్టును శాంపూతో కడగండి.
చిట్కాలు:
వారానికి రెండు నుంచి మూడు సార్లు తలకు నూనె రాసుకోండి.
మీ జుట్టును చాలా వేడిగా ఉండే నీటితో కడగవద్దు.
మీ జుట్టును ఎక్కువగా డ్రై చేయవద్దు.
సహజమైన షాంపూలను ఉపయోగించండి.
Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook