Diabetes Fruit: డయాబెటిస్‌కు చికిత్స లేదు. నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంది. జీవనవిధానం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరమైంది మధుమేహం. ఆహారపు అలవాట్లపై ఎప్పటికప్పుడు తగిన శ్రద్ధ వహిస్తేనే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌పై ఫోకస్ పెట్టాలి. ఇది కష్టమైనా తప్పదు. ఏ మాత్రం పొరపాటు చేసినా బ్లడ్ షుగర్ లెవెల్స్ తిరిగి పెరిగిపోతాయి. అందుకే ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. డయాబెటిస్ అదుపు తప్పితే కిడ్నీ, హార్డ్ వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో డయాబెటిస్ రోగులకు ఓ ఫ్రూట్ మంచి ప్రయోజనాన్ని కల్గిస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా అధికం. చాలా రకాల వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తుంది. మధుమేహంతో పాటు చాలా వ్యాధులను దూరం చేస్తుంది.
దానిమ్మలో న్యూట్రియంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కే, ఫైబర్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్, ఫెనోలిక్స్, ఐరన్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా లాభదాయకం.
దానిమ్మ పండ్లను గర్భిణీ మహిళలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలెక్కువ. వీటి ద్వారా గర్భం సమయంలో ప్లెసెంటా సెక్యూర్ అవుతుంది. ఇందులో ఉండే ఫోలేట్ మహిళల గర్భంలో ఉండే బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.
దానిమ్మ పండ్లు డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. దానిమ్మ గింజలు ఎర్రగా లేదా తెల్లగా ఉంటాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మదుమేహం వ్యాధిగ్రస్థులకు దివ్యౌధంలా పనిచేస్తుందంటే అతిశయోక్తి లేదు. దానిమ్మను నేరుగా తింటేనే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఉండే ఫైబర్ మధుమేహం నియంత్రణకు దోహదపడుతుంది.
Also read: High Cholesterol Tips: శరీరంలో ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు అర్ధం, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook