Heart Attack Reasons: గుండె వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువ, కారణాలేంటి

Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో స్ట్రోక్ ముప్పుకు ప్రధానంగా 5 కారణాలు చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 28, 2024, 07:36 PM IST
Heart Attack Reasons: గుండె వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువ, కారణాలేంటి

Heart Attack Reasons: పురుషులతో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్ సమస్య ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వివిధ అధ్యయనాల్లో తేలింది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. ప్రతి యేటా లక్షలాదిమంది గుండె వ్యాధులతోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు, కారణాలేంటనేది తెలుసుకుందాం.

మహిళల్లో స్ట్రోక్ సమస్యకు చాలా కారణాలుండవచ్చు. అందులో వయస్సు ఓ కారణమైతే హార్మోన్ ప్రభావం, అధిక రక్తపోటు, డయాబెటిస్, స్మోకింగ్, మద్యపానం వంటి ఇతర కారణాలు చాలా ఉన్నాయి. మహిళల్లో డయాబెటిస్ వ్యాధి గుండె వ్యాధుల ముప్పును పెంచుతుంది. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడి స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఇక ధూమపానం, మద్యపానం కూడా మహిళల్లో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు రక్త నాళాల్ని దెబ్బతీస్తాయి. 

ఇక వయస్సుతో పాటు మహిళల్లో స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. 55 ఏళ్లు దాటితే మహిళల్లో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ మార్పు కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మెనోపాజ్ సందర్భంగా హార్మోన్ మార్పులు ఇందుకు కారణమౌతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల రక్త నాళాల్లో స్వెల్లింగ్, అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. 

Also read: Diwali Lucky Signs: 500 ఏళ్ల తరువాత దీపావళిన గజకేసరి యోగం, 3 రాశులకు ధనయోగం, వద్దంటే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x