Healthy Drinks: రోజంతా ఎనర్జెటిక్‌గా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెంచేందుకు, పలు అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు అద్భతమైన హోమ్ రెమిడీస్ మీ కోసం అందిస్తున్నాం..
ఉదయం మనం ఏం చేస్తామనేదానిపై ఆ రోజంతా మీకు ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. రోజు ఉదయం శుభారంభమైతే..రోజంతా బాగుంటుంది. ఇలా ఉండాలంటే ఉదయం వేళల్లో హెల్తీ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి. ఈ హెల్తీ డ్రింక్స్‌లో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండటమే కాకుండా..మీ బాడీ ఇమ్యూనిటీని వేగంగా పెంచుతాయి. అదే సమయంలో పలు అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తాయి.
అల్లోవెరా జ్యూస్ ప్రతిరోజూ ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో ఔషధమొక్కగా ప్రాచుర్యం పొందింది. అనాదిగా వివిధ రకాల చికిత్సా పద్ధతుల్లో వినియోగిస్తున్నదే. శతాబ్దాల తరబడి అల్లోవెరా వాడకం ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అల్లోవెరా జ్యూస్ అనేది ఆరోగ్యానికి, చర్మానికి, కేశ సంరక్షణకు చాలా మంచిది.
కొబ్బరి నీళ్లను అత్యంత ఉత్తమమైన డ్రింక్‌గా చెప్పవచ్చు. ఇది సహజసిద్ధమైన స్వీట్నెస్‌ను కలిగి ఉండటమే కాకుండా హైడ్రేషన్‌పరంగా, శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్ల పరంగా చాలా మంచిది. కొబ్బరినీళ్లతో అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
తేనె, దాల్చినచెక్క అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ఓ గ్లాసు నీళ్లలో కలుపుకుని ఉదయం వేళ తీసుకుంటే బెస్ట్ ఎనర్జెటిక్ డ్రింక్‌గా ఉంటుంది.
నిమ్మరసం అనేది ఆరోగ్యానికి అవసరమైన అత్యుత్తమ విటమిన్ సి. ఉదయం వేళ ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. టీ, కాఫీలకు మంచి ప్రత్యామ్నాయం కాగలదు.
దానిమ్మ జ్యూస్ లేదా టీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అరకప్పు చిల్డ్ గ్రీన్ టీలో దానిమ్మ జ్యూస్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. రోజూ ఉదయం తీసుకుంటే..ఆ రోజంతా బాగుంటుంది. దానిమ్మతో టీ కూడా చేసుకోవచ్చు.
దాల్చినచెక్క గ్రీన్ టీలో చాలా ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి సమస్యలు దూరమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook