Easy Ways To Burn Calories: భారతదేశంలో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది పురుషులు, మహిళలను సమానంగా ప్రభావితం చేస్తుంది. పురుషులు రోజుకు సగటున 500 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తున్నారని మహిళలు 400 క్యాలరీల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారని అంచనా వేయబడింది. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుంది.
రోజువారీ శారీరక శ్రమ బరువు నియంత్రణకు చాలా ముఖ్యమైనది. తింటున్న ఆహారానికి సరిపడా క్యాలరీలు ఖర్చు చేయకపోతే అవి శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే రోజువారీ శారీరక శ్రమ అంటే ఏమిటి? ఎంత చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి.
కార్డియో వ్యాయామాలు, ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, క్యాలరీలు బర్న్ చేయడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రోజుకు ఒక గంట జాగింగ్ ద్వారా మీరు సుమారు 400 క్యాలరీలు బర్న్ చేయవచ్చు అయితే ఒక గంట హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ (HIIT) ద్వారా మీరు 500 నుంచి 1000 క్యాలరీల వరకు బర్న్ చేయవచ్చు. అందరికీ వ్యాయామశాలకు వెళ్లి కష్టపడి వ్యాయామం చేయడానికి సమయం, డబ్బు, శక్తి ఉండకపోవచ్చు. కానీ నడక అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలిగే ఒక సులభమైన ప్రభావవంతమైన వ్యాయామం. రోజువారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా కూడా నడకను మన అలవాటుగా మార్చుకోవచ్చు.
నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. రక్తపోటు, డయాబెటిస్ కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది.
మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని బయటకు తీసుకెళ్ళడం ద్వారా సులభంగా గంటకు 200 క్యాలరీలను కరిగించుకోవచ్చు. ఇది ఒక మంచి వ్యాయామం మాత్రమే కాకుండా మీకు, పెంపుడు జంతువుకు సరదాగా కూడా ఉంటుంది. అయితే, ఫిట్‌గా ఉండటానికి కేవలం శారీరక శ్రమ సరిపోదు. తగిన ఆహార నియమాలు కూడా పాటించడం చాలా ముఖ్యం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి