Weight Loss Tips: స్థూలకాయం తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయాలున్నాయి. కొన్ని సత్ఫలితాలనిస్తే..మరికొన్ని వికటిస్తుంటాయి. ఆహారప అలవాట్లలో మార్పుల ద్వారా స్థూలకాయం నియంత్రణ సాధ్యమేనంటున్నారు.
స్థూలకాయమనేది చాలా ప్రమాదకరం. ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా...డయాబెటిస్, హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ముప్పు పొంచి ఉంది. నడుము, కడుపు భాగంలో కొవ్వు కూడా పేరుకుపోతుంటుంది. బాడీ ఫిజిక్ పాడవుతుంది. ఫలితంగా ఆత్మ విశ్వాసం లోపించడంతో స్ట్రెస్‌కు లోనవుతుంటారు. మనం తరచూ తినే ఆహార పదార్ధాలే మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి. ఆయిల్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ తింటూ బిజీ లైఫ్‌స్టైల్‌లో పడి..ఆరోగ్యాన్ని పట్టించుకోరు. రోజూ రాత్రి పడుకునేముందు 4 రకాల ఆహార పదార్ధాలు తింటే..బరువు కచ్చితంగా తగ్గుతారు.
రాత్రివేళ భోజనం తరువాత పెరుగు తప్పకుండా తీసుకోవాలి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండి..ప్రోటీన్లు లభిస్తాయి. ఫలితంగా మజిల్స్ పటిష్టమౌతాయి. దాంతోపాటు పెరుగుతో ఉన్న మైక్రో న్యూట్రియంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.
ఇక రెండవది చాలా సందర్భాల్లో రాత్రి వేళ ఆకలేస్తుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా ఆలస్యంగా నిద్రపోయేవారిలో కన్పిస్తుంది. రాత్రి వేళ ఆకలేసినప్పుడు కొద్దిగా బాదాం తింటే మంచిది. బాదాంలో కీలకమైన న్యూట్రియంట్లు, కేలరీలు లభిస్తాయి.
రాత్రి ఆకలి ఎక్కువైతే.. ఇతరత్రా ఏవీ తినకుండా హోల్ గ్రెయిన్ బ్రెడ్ 2 స్లైడ్స్‌పై పీనట్ బటర్ వేసి తినాలి. దీనివల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
సాధారణంగా ఆరటి పండ్లు తింటే బరువు పెరుగుతారని చెబుతారు. కానీ ఇందులో ఉండే న్యూట్రియంట్లు బరువు తగ్గిస్తాయి. అరటిలో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా..ఎక్కువసేపు ఆకలేయదు. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.ఈ నాలుగు వస్తువుల్లో అవసరమైన న్యూట్రియంట్లు లభిస్తాయి. వీటివల్ల అలసట ఉండదు. పెరుగు, బాదాం మెరుగైన ఆరోగ్యాన్ని కల్గిస్తాయి.
Also read: Nephrotic Syndrome: మీ పిల్లలు తరచుగా అలసిపోతున్నారా..? అయితే ఈ సమస్యల కారణంగానే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook